ఖాళీ కడుపుతో కరివేపాకు పొడి + తేనె కలిపి తీసుకుంటే చాలు.. !!

మన వంటకాల్లో కరివేపాకు ఒక ముఖ్యమైన భాగం. వాటి ఉపయోగం కేవలం రుచికి మాత్రమే పరిమితం కాదు. ఆయుర్వేదం, సంప్రదాయ వైద్యంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. కరివేపాకులో ఉండే అనేక రకాల మొక్కల ఆధారిత సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో, బరువు తగ్గడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండిన కరివేపాకు మధుమేహం, ఇన్ఫెక్షన్ల నుండి జుట్టు రాలడం, అజీర్ణం వంటి అనేక రోగాలకు శక్తివంతమైన సహజ రోగ నివారణి.

కరివేపాకు తక్కువ క్యాలరీలతో పాటు అద్భుతమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఇది సమతుల్య ఆహారంలో ఒక విలువైన భాగం. ఓ 100 గ్రాముల కరివేపాకు సుమారుగా 830 మి.గ్రా.ల కాల్షియాన్ని అందిస్తుంది. ఇది ఎముకలు, దంతాల ఆరోగ్యానికి సహకరిస్తుంది. ఇందులో ఫాస్ఫరస్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి బలమైన ఎముకలు, కండరాల పనితీరు, జీవక్రియ ప్రక్రియల నిర్వహణకు అవసరం. డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది.

కరివేపాకును రోజూ ఎలా తీసుకోవాలి:

పచ్చిగా, పరగడుపున నమలండి..

కరివేపాకు ప్రయోజనాలను పొందడానికి సులభమైన, అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి ఉదయం లేవగానే 5-10 పచ్చి ఆకులను నమలడం. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, నిర్విషీకరణకు ఎంతగానో సహాయపడుతుంది.

కరివేపాకు జ్యూస్

కొన్ని పచ్చి కరివేపాకులను కొద్దిగా నీరు, నిమ్మరసం, తేనెతో కలిపి బ్లెండ్ చేయండి. ఇది శుద్ధీకరణ, జీవక్రియను పెంచే మార్నింగ్ టానిక్‌గా పనిచేస్తుంది. అదనపు ప్రయోజనాల కోసం మీరు పుదీనా లేదా దాల్చినచెక్కను కూడా చేర్చవచ్చు.

హెర్బల్ టీ..

తులసి, అల్లం, చిటికెడు దాల్చినచెక్కతో కరివేపాకులను మరిగించి రోగనిరోధక శక్తిని పెంచే టీ తయారుచేసుకుని ఉదయాన్నే గోరువెచ్చగా తీసుకోవచ్చు. ఇది- శ్వాసకోశ ఆరోగ్యం, జీర్ణక్రియ, అలసటను తక్షణమే నివారిస్తుంది.

కరివేపాకు పొడిని ఆహారంలో లేదా ఔషధాలలో

కరివేపాకును నీడలో ఆరబెట్టి, మెత్తని పొడిగా దంచండి. దీనిని చట్నీలు, మసాలా పొడులుగా భోజనంలో వినియోగించవచ్చు. టూత్ పౌడర్ గా కూడా వాడుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ నోటిని పరిశుభ్రం చేస్తుంది. దంతాల ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. పేగు కదలికలను మెరుగుపర్చుతుంది.

ప్రతి రోజూ భోజనంలో..

పప్పు, సాంబార్, తాలింపు లేదా వేపుడు కూరలలో కరివేపాకును చేర్చండి. వాటితో క్రమం తప్పకుండా వండటం రుచిని, పోషణను రెండింటినీ పెంచుతుంది. భోజన సమయంలో వీటిని పారవేయకుండా అలాగే నమిలి మింగడం వల్ల వాటి సారం మొత్తం శరీరానికి అందుతుంది.

హెయిర్ డై ఆయిల్‌లో ఉపయోగించండి:

కరివేపాకులను కొబ్బరి నూనెలో ఆకులు క్రిస్పీగా మారే వరకు మరిగించండి. నూనెను చల్లార్చి, వడగట్టి, వారానికొకసారి స్కాల్ఫ్‌కు మసాజ్ చేయండి. ఇది చుండ్రు, జుట్టు రాలడం, తెల్లబడటాన్ని తగ్గిస్తుంది. కరివేపాకులను కడిగి, ఆరబెట్టి, గాలి చొరబడని డబ్బాలలో ఫ్రీజ్ చేయవచ్చు. దీనివల్ల వాటి రుచిని, పోషకాలు ఎక్కువకాలం పాటు ఉంటాయి.

Disclaimer: కరివేపాకు ప్రయోజనాల గురించి పాఠకులకు తెలియజేయడమే ఈ కథనం ఉద్దేశం. మరింత సమాచారం కోసం డైటీషియన్లను సంప్రదించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+