డయాబెటిస్ పెషెంట్లకు గుడ్ న్యూస్: ఇకపై చౌక ధరకే ఆ షుగర్ టాబ్లెట్..!!

న్యూఢిల్లీ: దేశంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త! ప్రాణాంతక డయాబెటిస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే ఎంపాగ్లిఫ్లోజిన్ ఔషధం త్వరలోనే సామాన్యులకు అందుబాటులోకి రానుంది. అంతర్జాతీయంగా పేటెంట్ గడువు ముగియడంతో, దేశీయ ఔషధ దిగ్గజాలు ఈ మందును తక్కువ ధరకే ఉత్పత్తి చేసి విక్రయించేందుకు సిద్ధమయ్యాయి. తద్వారా డయాబెటిస్ చికిత్స ఖర్చులు భారీగా తగ్గనున్నాయి.

ప్రముఖ బహుళజాతి సంస్థ బోహ్రింగర్ ఇంగెల్‌హైమ్ యొక్క ఎంపాగ్లిఫ్లోజిన్ పేటెంట్ మార్చి 11తో ముగుస్తుంది.దీంతో మ్యాన్‌కైండ్ ఫార్మా, టొరెంట్, ఆల్కెమ్, డాక్టర్ రెడ్డీస్, లుపిన్ వంటి అగ్రగామి భారతీయ ఫార్మా కంపెనీలు జెనరిక్ ఎంపాగ్లిఫ్లోజిన్‌ను విడుదల చేయడానికి పోటీ పడుతున్నాయి.

Diabetes Drug Prices Slashed Generic Empagliflozin to Revolutionize Treatment in India

దేశంలోనే నాల్గవ అతిపెద్ద ఫార్మా సంస్థ అయిన మ్యాన్‌కైండ్ ఫార్మా సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 60 పలుకుతున్న ఒక్కో ఎంపాగ్లిఫ్లోజిన్ టాబ్లెట్‌ను కేవలం రూ. 6 కే అందించనున్నట్లు తెలిపింది. మిగిలిన జెనరిక్ కంపెనీలు కూడా రూ. 9 నుండి రూ. 14 మధ్య ధరల్లో మందులను విక్రయించే అవకాశం ఉంది. ఈ చౌక ధరల కారణంగా దాదాపు రూ. 20,000 కోట్ల విలువైన డయాబెటిస్ ఔషధ మార్కెట్‌లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి.గతేడాది ఈ మార్కెట్ 43 శాతం వృద్ధితో రూ.14,000 కోట్ల నుండి రూ.20,000 కోట్లకు చేరుకుంది.

ఈ సందర్భంగా మ్యాన్‌కైండ్ ఫార్మా అధికారి ఒకరు మాట్లాడుతూ, "అమెరికా వంటి కఠిన నిబంధనలు కలిగిన దేశాల సంస్థలచే ధృవీకరించబడిన ముడి సరుకులతో..నాణ్యమైన మందులను తక్కువ ధరకే అందించాలన్నదే మా లక్ష్యం. సొంతంగా APIని ఉత్పత్తి చేయడం ద్వారా ఖర్చులను తగ్గించుకోగలుగుతున్నాము. పంపిణీ, మార్కెట్ వాటాను పెంచుకునేందుకు రెండు వేర్వేరు బ్రాండ్లతో విక్రయాలు జరుపుతాము" అని అన్నారు.

Diabetes Drug Prices Slashed Generic Empagliflozin to Revolutionize Treatment in India

ఎంపాగ్లిఫ్లోజిన్ మెడిసిన్ డయాబెటిస్‌తో పాటు గుండె సంబంధిత సమస్యలు, మూత్రపిండాల వ్యాధులను నివారించడంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది.అధిక ధర కారణంగా ఈ మందు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ఇప్పుడు జెనరిక్ రూపంలో తక్కువ ధరకే లభించనుండటంతో కోట్లాది మంది డయాబెటిస్ రోగులకు ఊరట లభించనుంది. ముఖ్యంగా భారతదేశం వంటి దేశాల్లో డయాబెటిస్ రోగుల సంఖ్య 10 కోట్లు దాటిన నేపథ్యంలో ఈ పరిణామం ఎంతో కీలకం కానుంది.

ప్రస్తుతం టైప్-2 డయాబెటిస్‌కు మెట్‌ఫార్మిన్ మొదటి ప్రాధాన్య చికిత్సగా కొనసాగుతుండగా, వ్యాధి తీవ్రతను బట్టి సల్ఫోనిలురియాస్, DPP-4 ఇన్హిబిటర్స్, SGLT2 ఇన్హిబిటర్స్ వంటి మందులను వైద్యులు సూచిస్తున్నారు. సెమాగ్లుటైడ్, టిర్జెపాటైడ్ వంటి అత్యాధునిక మందులు సైతం అందుబాటులోకి వచ్చినా, ఎంపాగ్లిఫ్లోజిన్ వంటి చౌకైన జెనరిక్ మందులు పేద, మధ్యతరగతి ప్రజలకు వరంలా మారనున్నాయి. పరిమిత వైద్య బీమా సౌకర్యం ఉన్న మన దేశంలో, సొంత డబ్బులతో వైద్యం చేయించుకునే వారికి ఈ చౌక మందులు ఆర్థిక భారం తగ్గిస్తాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+