షుగరును తగ్గించే సింపుల్ చిట్కా

మారుతున్న ఆహారపు అలవాట్లు, మారిన జీవన విధానం లాంటి ఇత్యాది కారణాలన్నీ అతి తక్కువ వయసులోనే మధుమేహం రావడానికి కారణమవుతున్నాయి. షుగరువల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు వ్యాధుల ముప్పు పెరగడంతోపాటు ర్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మధుమేహం అనేది కేవలం మన అజాగ్రత్త వల్లనే వస్తుంది.

సోషల్ మీడియాతో అనారోగ్యం : షుగరులో రెండు రకాలుంటాయి. టైప్ 1, టైన్ 2 డయాబెటిస్. టైప్ 2 డయాబెటిస్ ను అరికట్టడమనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. మన లైఫ్ స్టైల్ ను బట్టి ఆరోగ్యం ఆధారపడివుంటుంది. కొందరు రాత్రివేళ సోషల్ మీడియాతో కాలం గడుపుతుంటారు. త్వరగా నిద్రపోరు. ఫలితం.. ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తారు. త్వరగా పడుకొని త్వరగా నిద్ర లేస్తే ఆరోగ్యం బాగుంటుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

Diabetes latest Tips

ఉదయం 8.30లోగా పూర్తవ్వాలి : ఉదయం 8.30 గంటల్లోగా బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేస్తే ఎంతో ఆరోగ్యమని చెబుతున్నారు. ఇది జరగాలంటే రాత్రిపూట తొందరగా పడుకొని ఉదయాన్నే తొందరగా లేవాలి. దీనికి సంబంధించి 10,575 మందిపై శాంపిల్స్ సేకరించి అధ్యయనం చేశారు. ఉదయం 8.30 గంటల్లోపు టిఫిన్ తినేస్తే షుగరు లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయని తేలింది. ఆ సమయంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గిందని గుర్తించారు. తినే టిఫిన్ లో కొవ్వు, ప్రొటీన్లు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా నిత్యం చేయడంవల్ల రక్తంలో బ్లడ్ షుగరు లెవల్ తగ్గుతుంది.

టిఫిన్ ఎక్కువగా తినాలి: కొంతమంది ఉదయాన్నే టిఫిన్ చేయరు. ఒకేసారి మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు. ఇది మంచి అలవాటు కాదని, మానుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.దీనివల్ల భవిష్యత్తులో పలు రోగాలు తలెత్తుతాయని, బ్రేక్‌ఫాస్ట్ గట్టిగా తిని..మధ్యాహ్నం, రాత్రి భోజనం తగ్గించాలని, అలాగే నిద్ర 7 నుంచి 8 గంటలు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+