షుగరు వ్యాధి ఉన్నవారు మందు కొట్టొచ్చా?

షుగరు వ్యాధి ఉన్నవారు మద్యం తాగకూడదు. వారికి ఈ విషయంలో ఎటువంటి మినహాయింపులు లేవు. మద్యం తాగాక మందులు వేసుకోవచ్చా? అన్న ప్రశ్నకు అసలు తావేలేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. షుగరుకు మద్యం తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుందని, మద్యంతో నాడులు దెబ్బతింటాయని చెబుతున్నారు.

మామూలుగానే మధుమేహులకు నాడులు దెబ్బతినే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువకాలం నుంచి షుగరుతో బాధపడుతుంటే అంత ఎక్కువగా నాడులు దెబ్బతినే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల చాలామంది కాళ్లు చేతుల తిమ్మిర్లెక్కడం, మంట పెట్టటం, సూదులు పొడిచినట్టు అనిపించటం వంటి వాటితో బాధపడుతుంటారు. ఈ సమస్యలకు షుగరు తోడైతే వ్యాధులన్నీ తీవ్రతరమవుతాయి. కాళ్లు మొద్దుబారడం, పుండ్లు పడటం, పుండ్లు మానకపోతే వేళ్లు, పాదాలు, కాళ్లు తొలగించాల్సి రావడం జరుగుతుంటుంది.

diabetes people do not take alcohol

ఎప్పుడైనా మద్యం తాగాల్సి వస్తే ముందు భోజనం చేసి మాత్రలు వేసుకోవాలి. మద్యం తాగిన తర్వాత భోజనం చేయకపోతే మందులు వేసుకోకూడదు. కాలేయం నిరంతరం గ్లూకోజ్ ను ఉత్పత్తి చేస్తూ రక్తంలో గ్లూకోజు మొతాదులు స్థిరంగా ఉండేలా చూస్తుంది. ఈ ప్రక్రియను మద్యంలోని ఆల్కహాల్ దెబ్బతీస్తుంది. దీనివల్ల శరీరానికి తగినంత గ్లూకోజు ఉత్పత్తవదు. ఫలితంగా గ్లూకోజు మోతాదులు పడిపోతాయి.

యాంటీ బయోటిక్స్, నొప్పిని తగ్గించే మందులవంటివి జీర్ణాశయ పూత సమస్యకు దారితీస్తాయి. మద్యం కూడా ఈ సమస్యను తెచ్చిపెడుతుంది. మందులు, మద్యం.. రెండూ కలిస్తే సమస్య ఇంకా ఎక్కువవుతుందేకానీ తగ్గదు. కొందరికి వాంతులు, ఛాతీలో మంట వస్తాయి. మరికొందరికి రక్తపు వాంతులు కావొచ్చు. మందులు వేసుకునేటప్పుడు మద్యం జోలికి వెళ్లకూడదని తెలుసుకోవాలి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+