Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డయాబెటిక్ ఫుట్.. నిర్లక్ష్యం చేస్తే డేంజర్, కాళ్ళు తీసేసే ప్రమాదం!

భారతదేశంలో డయాబెటిక్ ఫుట్ (మధుమేహ పాదం) ఒక పెద్ద ఆరోగ్యసమస్యగా మారుతోంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుండటంతో, డయాబెటిక్ ఫుట్ వంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతోంది. ఈ పరిస్థితి తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు, సకాలంలో చికిత్స చేయకపోతే కాలు తీసివేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఈ ప్రమాదకరమైన పరిణామాలను నివారించాలంటే, దీనిపై సరైన అవగాహన కలిగి, వెంటనే తగిన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.

డయాబెటిక్ ఫుట్ అంటే ఏమిటి?
డయాబెటిక్ ఫుట్ అనేది నరాలు దెబ్బ తినడం వల్ల (న్యూరోపతి), రక్త ప్రసరణ సరిగా లేకపోవడం (పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్) వల్ల వస్తుంది. ఈ సమస్యల కారణంగా ఒకవేళ పాదాలపై చిన్న గాయాలు కూడా త్వరగా మానవు, అంతేకాకుండా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ పరిస్థితిని సమర్థవంతంగా అదుపులో ఉంచుకోవచ్చు.

Diabetic Foot A Major Health Concern Cases Rise In India

డయాబెటిక్ ఫుట్ సమస్యతో డేంజర్
ప్రపంచంలోనే అత్యధిక మధుమేహ వ్యాధిగ్రస్తులు భారతదేశంలో ఉన్నారు. ఇది డయాబెటిక్ ఫుట్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. అధ్యయనాల ప్రకారం, మధుమేహంతో బాధపడుతున్న ప్రతి 100 మందిలో సుమారు 15 మందికి ఏదో ఒక సమయంలో పాదాలపై గాయాలు వచ్చే అవకాశం ఉంది. డయాబెటిక్ ఫుడ్ సమస్యతో పుండ్లు పడే సమస్య రాకుండా ఉండాలంటే ముందే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం.

డయాబెటిస్ ఫుట్ రాకుండా నివారించటానికి మార్గాలివే
మధుమేహం ఉన్నవారు తరచుగా పాదాలను పరీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాదాలకు సరైన చెప్పులు లేదా బూట్లు ధరించడం, పాదాల పరిశుభ్రతను పాటించడం, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం వంటివి డయాబెటిక్ ఫుట్ రాకుండా నివారించడానికి ముఖ్యమైన మార్గాలు. కనుక డయాబెటిస్ ఉన్నవారు పాదాల సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం చెయ్యొద్దు.

డయాబెటిస్ ఫుట్ సమస్యల పరిష్కారానికి చెయ్యల్సిందిదే
డయాబెటిక్ ఫుట్ సమస్యలను పరిష్కరించడంలో వైద్యులు, నర్సులు వంటి ఆరోగ్య సంరక్షణ నిపుణుల పాత్ర చాలా కీలకం. వారు రోగులకు తమను తాము ఎలా చూసుకోవాలో మార్గనిర్దేశం చేస్తారు, అవసరమైనప్పుడు తగిన చికిత్స అందిస్తారు. రోగులు, వైద్య బృందం కలిసి పనిచేయడం ద్వారా ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడంతో పాటు, నివారణకు కూడా తోడ్పడుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+