షుగరు ఉన్నవారు ఇలాంటి స్వీట్లు తినండి
తీపిని ఆస్వాదించాలనుకునే డయాబెటిక్ రోగులుకొన్నిసార్లు చిన్న చిన్న పరిమాణంలో మిఠాయిలను తినవచ్చు. రక్తంలో చక్కెర నియంత్రణలో ఉన్నవారు మాత్రమే ఇది చేయాలి. చక్కెర నియంత్రణ లేని రోగులు స్వీట్ల జోలికి వెళ్లకూడదు. వారు తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. మిఠాయిలు తినాలనిపించినప్పుడు రక్తంలో చక్కెర శాతం ఎంత ఉందో చెక్ చేసుకోవాలి.
షుగరు ఉన్నవారు స్వీట్లు తినే ముందు ఫైబర్ , ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత కొవ్వు ,కార్బోహైడ్రేట్లు ఉన్న వాటిని తీసుకోవాలి. దీని తర్వాతే మిఠాయిలు తీసుకోవాలి. ఇలాంటి పద్ధతిని ఫాలో అవడంవల్ల షుగర్ మీద స్వీట్లు ఎక్కువ ప్రభావం చూపవు. తీపిని కూడా ఆస్వాదించగలుగుతారు. తీసుకున్న తీపి పదార్థాల పరిమాణం ఎక్కువగా ఉండకూడదు. లేదంటే మీకు హాని కలుగుతుంది.

ఎప్పుడూ ఖాళీ కడుపుతో స్వీట్లు తినకూడదు. షుగర్ లెవెల్ లో అకస్మాత్తుగా పెరగడానికి కారణం కావచ్చు. షుగర్ పేషెంట్లు టిఫిన్ చేసిన తర్వాత లేదంటే భోజనం చేసిన తర్వాతే తినాలి. దీనివల్ల రక్తంలో చెక్కెర శాతం అదుపులో ఉంటుంది. పొద్దున్నే స్వీట్స్ తినకూడదు. రాత్రివేళల్లో ఎక్కువమంది ఫంక్షన్లకు వెళుతుంటారు. షుగరు ఉన్నవారు రాత్రిపూట స్వీట్లు తినకూడదు. దీనివల్ల నిద్రకు ఇబ్బంది కలగడమే కాకుండా రాత్రిపూట పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. తర్వాతరోజు వాంతి చేసుకునే అవకాశం ఉంది. అందుకే రాత్రిపూట మిఠాయిలు తీసుకోకుండా ఉండాలి. డయాబెటిక్ రోగులు పొడి స్వీట్లను మాత్రమే తినాలి. కూల్ డ్రింక్స్, తీపి రసాలకు దూరంగా ఉండాలి. ద్రవ పదార్థాలు రక్తంలో చక్కెర శాతాన్ని వేగంగా పెంచుతాయి. టైప్ 1 డయాబెటిస్, ఇన్సులిన్ తీసుకునే వారు ఎలాంటి స్వీట్లు తీసుకోకూడదు.












Click it and Unblock the Notifications