బియ్యం తింటున్నారా? ఇది తెలిస్తే అస్సలే తినరు!

చాలామందికి బియ్యం తినే అలవాటు ఉంటుంది. ఇంట్లో ఎన్ని తినే ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ వారి మనసు బియ్యం మీదనే పోతూ ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ కాసిన్ని బియ్యాన్ని నోట్లో వేసుకుని తింటూ ఉంటారు. కానీ ఇళ్లల్లో పెద్దవాళ్లు బియ్యం తినకూడదని పదేపదే చెబుతారు. అయితే ఈ విధంగా బియ్యాన్ని తినడం వల్ల ఏం జరుగుతుంది?

బియ్యం తినే అలవాటు ఈ లోపంతోనే
ఎందుకు మన పెద్దవాళ్లు బియ్యం తినకూడదని పదే పదే చెబుతారు? అసలు వద్దన్నా వాళ్ళు బియ్యం ఎందుకు తింటారు? అనేది ప్రస్తుతం తెలుసుకుందాం. చాలామందిలో ఎవరు వద్దన్నా సరే బియ్యం తిని అలవాటు ఉంటుంది. పోషకాహార లోపం వల్లే ఈ సమస్య ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఐరన్ డెఫిషియన్సీ వల్ల, విటమిన్ బి12 శరీరంలో తక్కువగా ఉండడం వల్ల బియ్యాన్ని తినాలని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు

Do you eat raw rice know the health problems by eating raw rice

బియ్యాన్ని నేరుగా తింటే జరిగేదిదే
బియ్యంలో మన శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు, క్యాల్షియం, ఫైబర్, ఐరన్, థియామిన్, రిబో ఫ్లేవిన్ తో సహా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. అయితే బియ్యాన్ని పచ్చిగా తింటే మాత్రం అది ఏమాత్రం మనకు ఆరోగ్యాన్ని ఇవ్వదు. వండుకోకుండా బియ్యాన్ని నేరుగా తింటే ఎన్నో వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. వండుకోకుండా బియ్యాన్ని తినడం వల్ల జీర్ణ సమస్య వస్తుంది.

బియ్యం తినే వారిలో ఈ అనారోగ్య సమస్యలు
కడుపునొప్పితో బాధపడాల్సి వస్తుంది. బియ్యాన్ని నేరుగా తినడం వల్ల శారీరకంగా అలసట, బలహీనత వంటి సమస్యలు వస్తాయి. బియ్యం లో లెక్టిన్ అనే మూలకం ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల ఇది కడుపు ఉబ్బరాన్ని, మలబద్దకాన్ని, కడుపునొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. బియ్యం ప్రేగు కదలికలలో ఇబ్బందిని కలిగిస్తుంది. బియ్యాన్ని నేరుగా తినడం వల్ల మూత్రపిండాల సమస్యలు వస్తాయి.

నీరసం, రక్త హీనత సమస్యలతో ఇబ్బంది
బియ్యం సులభంగా జీర్ణం కాదు కాబట్టి వీటిని తింటే వాంతులు, విరోచనాలు అయ్యే అవకాశం కూడా ఉంది..ఇక వీరు బియ్యం తినడం వల్ల రక్తంలోని తెల్ల రక్త కణాలు చనిపోతాయి. ముఖం పాలిపోతుంది. ఎప్పుడూ నీరసంగా డల్ గా తయారవుతారు. బియ్యం తినేవారిలో ఉత్సాహం లోపిస్తుంది. రక్తహీనత సమస్య వస్తుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+