చికెన్, మటన్ తినడంవల్ల ఎన్ని రోగాలు వస్తాయో తెలుసా?
ప్రస్తుతం ప్రజల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఏం తినాలన్నా క్షణాల్లో ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే చాలు కళ్లముందు కోరుకున్న ఆహారం వచ్చి వాలుతోంది. ఇలా ఆర్డర్ చేసే ఆహారాల్లో అత్యధికంగా మాంసాహారమే ఉంటోందని జొమాటో ఇటీవలే ప్రకటించింది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీని ప్రజలు ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. అయితే చికెన్, మటన్ తరుచుగా తినడంవల్ల అనేక అనారోగ్యాలు కలుగుతాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది. అంతేకాదు.. భయంకరమైన రోగాలు కలుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా మితంగా మాత్రమే తినాలని చెబుతున్నారు. చికెన్, మటన్ వల్ల కలిగే కొన్ని ప్రధాన సమస్యలు ఏమిటనేది తెలుసుకుందాం.
గుండె జబ్బులు, క్యాన్సర్, షుగరు
ఎర్ర మాంసంలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని భారీగా పెంచుతుంది. అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎర్ర మాంసాన్ని ఎక్కువగా తినడం కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎర్ర మాంసం రక్తంలో చక్కెర స్థాయిని పెంచి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని అధికం చేస్తుంది. కొంతమందికి ఎర్ర మాంసం జీర్ణం కావడంలో ఇబ్బంది ఎదురవుతుంది. ఇది వారి జీర్ణక్రియ ఆరోగ్య తీరునుబట్టి ఆధారపడి, అజీర్తి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలకు దారితీస్తుంది.

మాంసాహారం పూర్తిగా మానొద్దు
ఎర్ర మాంసంలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. దీనిని అధికంగా తీసుకోవడం బరువు పెరుగుతారు. చికెన్, మటన్‌లో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి కాబట్టి వీటిని పూర్తిగా మానేయొద్దని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఎర్ర మాంసాన్ని తక్కువగా తీసుకోవడం మంచిది. మాంసాన్ని కొనుగోలు చేసే సమయంలో తక్కువ కొవ్వు ఉన్న వాటిని ఎంచుకోవడంతోపాటు మాంసం బదులుగా చేపలు, గుడ్లు, బీన్స్, ఇతర ప్రోటీన్ మూలాలను ఎంచుకోవచ్చు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఎక్కువగా తినండి. శాఖాహారులు మాంసాహారంలో దొరికే మిటమిన్లు, ఖనిజాలు వేటిల్లో దొరుకుతాయో తెలుసుకొని వాటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.












Click it and Unblock the Notifications