భోజనం చేశాక ఈ పనులు చేస్తున్నారా? అయితే డేంజర్!
ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార నియమాలు పాటించాలి. ఆహారాన్ని ఏ సమయంలో తినాలి? ఎంత మొత్తంలో తినాలి? తిన్న తర్వాత ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. మనలో చాలామంది తిన్న తర్వాత ఏం చేయకూడదు అనేది తెలుసుకోకుండా ఏది పడితే అది చేస్తూ ఉంటాం. దీనివల్ల మన ఆరోగ్యం పాడవుతుంది.
భోజనం చేశాక ఈ పనులు చెయ్యొద్దు
భోజనం చేసిన తర్వాత మనం చేయకూడని పనులు చేస్తే అది మన జీర్ణ ప్రక్రియ పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే భోజనం తిన్న వెంటనే చేయకూడని కొన్ని పనులను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. భోజనం తిన్న వెంటనే చాలామందికి కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. ఇలా తిన్న తర్వాత కాఫీలు, టీలు తాగడం ఏమాత్రం మంచిది కాదు.

భోజనం చేశాక నిద్రపోతున్నారా?
ఈ విధంగా చేస్తే మన శరీరంలో మనం తీసుకునే ఆహారంలో ఉన్న పోషకాలు శరీరం గ్రహించే శక్తి క్షీణిస్తుంది. భోజనం చేసిన తర్వాత చాలామంది నిద్రపోతారు. ఇక భోజనం చేసిన తర్వాత నిద్రపోతే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీని వల్ల అజీర్ణం, గుండెలో మంట, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చి ఇబ్బంది పడతారు. ఇక చాలామంది భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగుతారు. ఇది కూడా మంచిది కాదు.
భోజనం చేసిన వెంటనే ఈ పనులతో డేంజర్
భోజనం చేసిన అరగంట తర్వాత నీళ్లను తాగితే మంచిది. తిన్న వెంటనే నీళ్లు తాగితే ఆహారం జీర్ణం కావడానికి మన బాడీలో సహకరించే ఎంజైమ్స్ తక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల ఆహారం సరిగ్గా డైజెస్ట్ కాదు. ఇక చాలామందికి తిన్న తర్వాత స్నానం చేసే అలవాటు ఉంటుంది. ఇది కూడా ఏమాత్రం మంచిది కాదు. భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది.
భోజనం చేశాక స్నానం, వ్యాయామం మంచిది కాదు
అజీర్ణం, కడుపుబ్బరం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఇక భోజనం చేసిన వెంటనే వ్యాయామం కూడా చేయకూడదు. ఇది కూడా మన జీర్ణ వ్యవస్థ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. కనుక భోజనం చేసిన తర్వాత వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications