మామిడిపండ్ల సీజన్ అని జ్యూస్ లు తెగ తాగేస్తున్నారా? ఇది మీ కోసమే!

వేసవి సీజన్లో అందరూ బాగా ఇష్టంగా తినే పండ్లు మామిడి పండ్లు. అటువంటి మామిడి పండ్లలో ఫుల్ పోషకాలు ఉంటాయి. మామిడి పండ్లు కేవలం రుచి మాత్రమే కాదు ఎన్నో మంచి చేసే గుణాలు, ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. అటువంటి మామిడి పండ్లను తినే విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించాలి. బాగా పోషకాలు ఉన్నాయని ఎక్కువగా తింటే కష్టం మీకే.. ఎక్కువ జ్యూసులు తాగినా నష్టం మీకే.

ఆరోగ్యం పై మామిడి పండ్ల ప్రభావం

మామిడిపండ్ల లో విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్ తోపాటు అనేక రకాల పోషకాలు ఉంటాయి. మామిడి పండు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. మామిడిపండు మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మామిడి పండు చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.

don t drink mango juice with these health issues know the facts and risks of consuming mango juice

మామిడి జ్యూస్ వీరికి చాలా డేంజర్

మామిడిపండును చాలామంది జ్యూస్ గా చేసుకుని తాగుతూ ఉంటారు. మామిడి పండుతో మిల్క్ షేక్ తయారు చేసుకుని తాగేవారు కూడా లేకపోలేదు. వేసవిలో చాలామంది మామిడిపండు జ్యూస్ ను ఇష్టంగా తాగుతారు. అయితే కొన్నిరకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మామిడిపండు జ్యూస్ తాగకూడదు. ఎందుకంటే మామిడిపండ్లలో సహజ చక్కెర ఉంటుంది. ఇక జ్యూస్ గా చేసుకున్నప్పుడు అందులో మరింత చక్కెరను కలుపుతారు. ఇది మధుమేహం బాధితులకు తీవ్ర అనారోగ్యానికి కారణమవుతుంది.

మ్యాంగో జ్యూస్ తాగితే ఈ సమస్యలు ఇబ్బంది పెడతాయి

చాలామంది బరువు తగ్గాలి అనుకునేవారు మ్యాంగో జ్యూస్ తాగకుండా ఉంటేనే మంచిది. మ్యాంగో జ్యూస్ లో అధిక క్యాలరీలు ఉండడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలని భావించేవారు మ్యాంగో జ్యూస్ తాగకూడదు. ఇదే సమయంలో ఎవరైతే జీర్ణ సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారో వారు మ్యాంగో జ్యూస్ తాగకుండా ఉంటేనే మంచిది. ఎసిడిటీ, గ్యాస్ సమస్యలతో బాధపడేవారు మ్యాంగో జ్యూస్ తీసుకోవద్దు.

ఈ వ్యాధులు ఉన్నవారికి మ్యాంగో జ్యూస్ మంచిది కాదు

కాలేయ సంబంధిత సమస్యల విషయంలో కూడా మ్యాంగో జ్యూస్ తాగకుండా ఉంటేనే మంచిది. కొంతమందికి మామిడిపండ్ల అలర్జీ ఉంటుంది. ఇక వారు కూడా మామిడి పండు జ్యూస్ జోలికి పోకుండా ఉంటే మంచిది. అటువంటి వారు కూడా మామిడిపండ్ల జ్యూస్ తాగితే అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు కూడా తాగకుండా ఉంటేనే మంచిది.

నిమ్మ తొక్కలు పడేస్తున్నారా? ఈ బెనిఫిట్స్ తెలిస్తే తొక్కలే కావాలంటారు​!
నిమ్మ తొక్కలు పడేస్తున్నారా? ఈ బెనిఫిట్స్ తెలిస్తే తొక్కలే కావాలంటారు​!

మామిడి పండ్ల జ్యూస్ విషయంలో రిస్ట్రిక్షన్

మామిడి పండ్లను తినడానికి, మామిడి జ్యూస్ ను మిల్క్ షేక్ లను తాగడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇక రోగాలతో ఉన్నవారు తాగకుండా కొంత రిస్ట్రిక్షన్ కూడా ఉంటుంది. కనుక మామిడి జ్యూస్ ను పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలు ఉన్నవారు తాగకుండా ఉంటేనే మంచిది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+