బ్లాక్ కాఫీ ఏ టైంలో తీసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది..!?
బ్లాక్ కాఫీ. ఈ మధ్య కాలంలో బాగా వినియోగం పెరిగింది. బ్లాక్ కాఫీ రిలాక్స్ చేసేందుకు చాలా బాగా సహాయపడుతుంది. దీంట్లోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అభిజ్ఞా పనితీరును మెరుగుపరి చేందుకు.. మెదుడు సామర్థ్యాన్ని పెంచేందుకు తోడ్పడతాయి. ప్రతీ రోజు బ్లాక్ కాఫీని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మరి, బ్లాక్ కాఫీ ఏ సమయంలో తీసుకోవాలి.. ఎన్ని కప్పుల కాఫీ తీసుకోవటం మంచిదనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. దీని పైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
బ్లాక్ కాఫీ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. బ్లాక్ కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్, మోలనోయిడిన్స్ వంటి శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ సమ్మేళనాలు శరీరం లో హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తటస్థం చేయడంలో సహాయపడతాయి. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాలను తగ్గిస్తాయి. రోజూ ఉదయాన్నే కప్పు బ్లాక్ కాఫీని తాగడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు అంది వ్యాధులతో పోరాడే శక్తి మెరుగవుతుంది. మానసిక ప్రశాంతత కావాలనుకునే వారికి బ్లాక్ కాఫీ ఉపకరిస్తుంది. ఇందులోని కెఫైన్ మెదడుకు సహజమైన రిలాక్సేషన్ అందిస్తుంది. వర్కౌట్స్ చేయడానికి వెళుతున్నా లేదా రోజంతా బిజీ బిజీగా గడపాల్సి ఉన్నా బ్లాక్ కాఫీ తాగి వెళ్లడం మంచిది. ఇది మీ శారీరక పనితీరుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది.

ఇందులోని కెఫైన్ రక్తంలో అడ్రినాలిన్ స్థాయిలును పెంచుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది శరీరంలోని కొవ్వు కణజాలాల నుండి ఫ్యాటీ యాసిడ్లను సమీకరించి శరీరా నికి కావాల్సిన శక్తి వినియోగానికి సహాయపడుతుంది. రోజూ ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగడం వల్ల సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్ వంటి కాలేయ వ్యాధులకు దూరంగా ఉండచ్చని కొన్ని పరిశోధనలు తేల్చాయి. వాస్తవానికి కాఫీ తాగని వారితో పోల్చి చూస్తే క్రమం తప్పకుండా తాగే వ్యక్తుల్లో కాలేయ వ్యాధి ప్రమాదాలు 80శాతం వరకూ తక్కువగా ఉంటున్నాయని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. అదే విధంగా రెండు లేదా మూడు కప్పుల కాఫీ తీసుకోవటం ద్వారా ఆరోగ్య పరంగా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక, ప్రతీ రోజు ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగే అలవాటు ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడంలో చాలా సహాయపడతాయని తేల్చి చెబుతున్నారు.












Click it and Unblock the Notifications