శరీరానికి నీరు అవసరమేకానీ.. ఈ సందర్భాల్లో చాలా ప్రమాదం!
మనిషి శరీరంలో అధిక శాతం మంచినరే ఉంటుంది. సరైనపాళ్లలో నీరు లేకపోతే శరీరం లోపల ఎటువంటి పనులు జరగవు.. అన్నీ స్తంభించిపోతాయి. అయితే నీరు తాగే విషయంలో పరిమితులు కూడా ఉన్నాయి. వాటిని కచ్చితంగా పాటించకపోతే ప్రమాదం తలెత్తుతుంది. వాస్తవానికి మన శరీరంలో నీటి అసమతుల్యత ఏర్పడినప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఓవర్ హైడ్రేషన్, డీ హైడ్రేషన్ రెండూ శరీరానికి హాని కలిగిస్తాయి. వాటిగురించి తెలుసుకుందాం.
ఓవర్ హైడ్రేషన్: వాటర్ ఇంటాక్సికేషన్ లేదా ఓవర్ హైడ్రేషన్ అంటారు. అవసరానికి మించి నీరు తీసుకున్నప్పుడు ఇటువంటి పరిస్థితి తలెత్తుతుంది. రక్తప్రసరణలో అవసరమైన ఎలక్ట్రోలైట్లను పలుచన చేస్తుంది. ఈ ప్రభావంలో శరీరంలో ప్రతికూలతలు ప్రారంభమవుతాయి. వికారం, తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు, మూర్ఛలు, తీవ్రమైన సందర్భాల్లో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ నీరు తీసుకోవడంవల్ల కలిగే అనర్థం ఇది. సకాలంలో చికిత్స ఇవ్వకపోతే ప్రాణాలకే ప్రమాదం.

డీహైడ్రేషన్: శరీరం అధికంగా తన ద్రవాలను కోల్పోయినప్పుడు డీహైడ్రేషన్ సంభవిస్తుంది. విధులకు తోడ్పడటానికి అవసరమైన నీరు ఉండదు. విపరీతమైన చెమటలు, విరేచనాలు, వాంతులు తలెత్తుతాయి. తగినంత నీరు తీసుకోకపోవడంవల్ల డీ హైడ్రేషన్ సంభవిస్తుంది. గొంతు పొడారిపోవడం, దాహం, మైకం, అలసట ఏర్పడతాయి. డీహైడ్రేషన్ తీవ్రమైతే మూత్రపిండాలు విఫలమవుతాయి. ఇది ప్రాణాంతకమవుతుంది. పిల్లలు, వృద్ధలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది.












Click it and Unblock the Notifications