గుడ్డు ఏ టైంలో తింటే మంచిది.. ఏ వయసు వారు ఎన్ని తినచ్చు..!?
కోడిగుడ్లు సంపూర్ణ పౌష్టికాహారం. కోడిగుడ్లను రోజూ ఒకటి చొప్పున తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. కోడిగుడ్లను పరిమితి మేరకు తింటే ఎలాంటి సమస్యలు ఉండవు. దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు గుడ్లను రోజులో అసలు ఏ సమయంలో తినాలి.. ఏ సమయంలో తింటే మనకు ఎక్కువ పోషకాలు లభిస్తాయి, ఏ సమయంలో వాటిని తినడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది..? అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే ఇందుకు పోషకాహార నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
గుడ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా జింక్ అధికంగా ఉంటుంది. ఇది తెల్ల రక్త కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధు లకు చెక్ పెట్టవచ్చు. కోడిగుడ్లలో ఉండే మెగ్నిషియం కండరాలను ప్రశాంతంగా మారుస్తుంది. కండరాల నొప్పులను తగ్గించి కండరాలకు బలం కలిగేలా చేస్తుంది. దీంతో కండరాలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. కోడిగుడ్లలో ఐరన్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. రక్తం వృద్ధి చెందేలా చూస్తుంది. దీంతో రక్తహీనత తగ్గుతుంది. అలాగే నీరసం, అలసట తగ్గుతాయి. యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. కోడిగుడ్లను తినడం వల్ల ప్రోటీన్లను అధికంగా పొందవచ్చు. దీని వల్ల శరీరానికి శక్తి లభించి చురుగ్గా పనిచేస్తారు. శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి.

ఇక కోడిగుడ్లను ఉదయం తినడం వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఉదయం వ్యాయామం చేసిన అనంతరం గుడ్లను తింటే శరీరానికి శక్తి లభించి యాక్టివ్‌గా ఉంటారు. రోజంతా చురుగ్గా పనిచేయగలుగుతారు. రోజంతా శారీరక శ్రమ చేసేవారు కూడా ఉదయం గుడ్లను తింటే మేలు జరుగుతుంది. ఎక్కువ సేపు పనిచేయగలుగుతారు. కోడిగుడ్లను ఉడకబెట్టి తింటే ఎక్కువ మేలు జరుగుతుంది. ఇక శక్తి పెద్దగా అవసరం లేదని భావించేవారు గుడ్లను మధ్యాహ్నం ఉడక ట్టి తినవచ్చు. అయితే కోడిగుడ్లను రాత్రి పూట తినకూడదు. తింటే శరీరంలో అనవసరంగా క్యాలరీలు.. కొలెస్ట్రాల్ చేరుతాయి. ఇవి మనకు హాని చేస్తాయి. కనుక కోడిగుడ్లను ఉదయం లేదా మధ్యాహ్నం మాత్రమే తినాల్సి ఉంటుంది. కాగా.. వయసు ఆధారంగా కోడిగుడ్లను రోజుకు ఒకటి నుంచి రెండు వరకు తీసుకోవచ్చని సూచిస్తున్నారు. బీపీ, షుగరు సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సూచనల మేరకు తీసుకోవాల్సి ఉంటుంది.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్












Click it and Unblock the Notifications