Food: రాత్రి పూట ఆలస్యంగా తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!

భోజన ప్రియులు ఎక్కువమంది మధ్యాహ్నం లంచ్ కంటే రాత్రి డిన్నర్ ని ఇష్టపడతారు. కానీ రాత్రిపూట తినే భోజనం మన ఆరోగ్యాన్ని ఎన్నో విధాలా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా తినే ఆహారం కావొచ్చు.. తినే టైం కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది. అందుకే రాత్రిపూట సరైన సమయంలో.. సరైన ఆహారం తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ చాలా మంది బిజీ లైఫ్ స్టైల్ కారణంగా రాత్రిపూట చాలా లేట్ గా ఆహారం తీసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ఊబకాయంతో పాటు అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

రాత్రి 9 గంటల తర్వాత

రాత్రి 9 గంటల తర్వాత


చాలా మంది రాత్రి పూట తిన్న వెంటనే నిద్ర పోతుంటారు. కానీ అలా చేయకూడదు. తిన్న వెంటనే నిద్ర పోకూడదంటే.. మనం రాత్రి 9 గంటల లోపే తినడం మంచిది. చాలా రాత్రి 9 తర్వాత తింటారు. తిన్నవెంటనే పడుకుంటుంటారు. ఇలా పడుకుంటే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల శరీర జీవక్రియ నెమ్మదిగా పనిచేస్తుందని హెచ్చరిస్తున్నారు.

మలబద్ధకం

మలబద్ధకం


ఇలా తిన్న వెంటనే పడుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్, రక్తంలో ఎక్కువ చక్కెర స్థాయిలు, ఊబకాయం, గుండె జబ్బులు వంటి ఎన్నో రోగాలు వచ్చే అవకాశం ఉందట. చాలా అధ్యయనాలు.. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్యే భోజనం చేయడం మంచిదని చెబుతున్నాయి. రాత్రి పూట ఆలస్యంగా తినే అలవాటు ఎన్నో రోగాలకు దారితీస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఇది జీర్ణ శక్తిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందట.

కొవ్వు పెరగడం

కొవ్వు పెరగడం


రాత్రి ఆలస్యంగా తినడం వల్ల బరువు వేగంగా పెరుగుతారని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. సకాలంలో తినకపోవడం వల్ల శరీర జీవక్రియ మందగిస్తుంది. దీని వల్ల వినియోగించే క్యాలరీలు సరిగా కరిగిపోవు. అలాగే శరీర కొవ్వు పెరగడం మొదలవుతుంది. దీంతో ఊబకాయం పెరుగుతుంది. రాత్రిపూట ఆలస్యంగా తినే అలవాటు నిద్రలేమికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రిళ్లు సరిగ్గా నిద్రరాకపోవడానికి కారణాల్లో ఆలస్యంగా తినడం కూడా ఒకటి. లేట్ గా తినడం వల్ల మన శరీరం దాన్ని సరిగ్గా జీర్ణించుకోలేకపోతుంది. ఫలితంగా నిద్రసరిగ్గా రాదు.

జంక్ ఫుడ్

జంక్ ఫుడ్


ఒకవేళ రాత్రి ఆలస్యంగా తినాలనుకుంటే పండ్లను తీసుకోవచ్చు. లేదా పాలు తాగొచ్చు. వీటిని తీసుకున్న తర్వాత వెంటనే నిద్ర పోకూడదని కనీసం అరగంటైనా ఆగాలి. రాత్రి ఆలస్యంగా జంక్ ఫుడ్ అస్సలు తినకూడదు. జంక్ ఫుడ్ తీసుకోవడం తర్వాత రోజు ఉదయం కూడా మీకు జీర్ణం కాదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+