ఈ సింపుల్ నేచురల్ టిప్స్ తో బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.. రాసి పెట్టుకోండి!
చాలామంది ఇప్పుడు విపరీతమైన పొట్ట సమస్యతో బాధ పడుతున్నారు. బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు బాన పొట్టకు కారణం. ఈ బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గించుకోవాలంటే మన ఇంట్లో సులభంగా దొరికే వాటితోనే సహజ పద్దతిలో చిట్కాలు పాటిస్తే మంచిది. ఈ సహజమైన పద్ధతులు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి . ప్రతీ ఒక్కరూ మీ రోజువారీ జీవితంలో వీటిని సులభంగా పాటించవచ్చు .
అల్లం టీ
అల్లం టీ జీర్ణక్రియకు చాలా మంచిదని అందరికీ తెలుసు. ఇది కడుపు ఉబ్బరం తగ్గించడమే కాకుండా, బరువు తగ్గడంలో కూడా ఎంతగానో సాయపడుతుంది. అల్లం టీ ప్రతీరోజూ పరిమిత మోతాదులో తీసుకుంటూ ఉంటే బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుంది.

నిమ్మరసం
మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించటానికి నిమ్మరసం చాలా మంచిది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నిమ్మరసం తాగడం వల్ల జీవక్రియ వేగవంతమై, బొడ్డు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండి, రోజూ తాగితే మంచిది.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్క కూడా బొడ్డు కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి, జీవక్రియను మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్కను నిత్యం తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. మీ ఉదయం కాఫీలో ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలుపుకొని తీసుకుంటే మంచిది.
తేనె
తేనె మన బెల్లీ ఫ్యాట్ తగ్గించటానికి ఎంతగానో దోహదం చేస్తుంది. గోరువెచ్చని నీటితో కలిపి నిత్యం తేనెను తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ తేనెను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకొని ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తాగితే తప్పక ఫలితం ఉంటుంది.
వెల్లుల్లి
వెల్లుల్లి బరువు తగ్గడానికి సాయం చేస్తుందని అంటారు. పచ్చి వెల్లుల్లి రెబ్బలను తిని, ఆ తర్వాత ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వల్ల బొడ్డు కొవ్వును సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలు మన ఇంట్లో దొరికే వాటితోనే బొడ్డు కొవ్వును తగ్గించుకోవడానికి చాలా సులభమైన, కానీ ప్రభావవంతమైన మార్గాలు. సమతుల్యమైన ఆహారం తింటూ, రోజూ వ్యాయామం చేస్తూ వీటిని తీసుకుంటే బొడ్డు కొవ్వు తగ్గుతుంది.












Click it and Unblock the Notifications