ఉదయాన్నే నిద్ర లేవగానే టీ తాగుతున్నారా?
ఉదయం నిద్ర లేవగానే చాలామంది ఖాళీ కడుపుతోనే టీ తాగుతారు. విదేశాల్లో ఉదయాన్నే బెడ్ కాఫీ తాగే అలవాటుంది. అది మనదగ్గర బెడ్ టీగా మారింది. నిద్ర లేవగానే కడుపులో ఓ ఛాయ్ పడితే ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది. దీనివల్ల నిద్ర మత్తు కూడా ఎగిరిపోతుంది. అయితే పరగడుపున టీ ని తీసుకోవడంవల్ల లాభాలకంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.
ఒత్తిడి వల్ల?: టీ తాగడంవల్ల ఎసిడిటీ, గుండెల్లో మంటతోపాటు గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. మనలో చాలామంది రోజుల్లో ఏడెనిమిదిసార్లు టీ తాగుతుంటారు. ఒత్తిడివల్ల వారు ఇలా చేస్తుంటారు. కానీ ఇలా పదే పదే టీ తాగడంవల్ల గ్యాస్, మంట, ఎసిడిటీ సమస్యలన్నీ కలిసి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయి. పరగడుపునే టీ తాగుండటంవల్ల నోటిలోని బ్యాక్టీరియా షుగర్ లెవల్స్ పెంచుతుంటుంది.

టీలో ఉండే పదార్థాలు మనిషి శరీరంలోని మూత్ర స్థాయిని పెంచుతాయి. దీనివల్ల మన శరీరంలోని నీరు మొత్తం బయటకు వెళుతుంది. ఖాళీ కడుపుతో తేనీరు తీసుకోవడంవల్ల డీహైడ్రేషన్ కు గురవుతారు. ఇది నిర్జిలీకరణ సమస్యకు దారితీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
జీర్ణక్రియ క్షీణిస్తుంది: అంతేకాదు.. టీ తాగిన తర్వాత చాలాసేపు ఆకలి వేయదని, దీనికి కారణం జీర్ణక్రియ క్షీణించడమేనని చెబుతున్నారు. జీర్ణక్రియ క్షీనించడంవల్ల శరీరానికి శక్తి అందదు. ఈ కారణంగా తొందరగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. టీ కారణంగా మలబద్దకం లాంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. దీనివల్ల నిద్రలేమి, ఆకలి వేయకపోవడం, బరువు పెరగడం, రక్తపోటు లాంటి సమస్యలు కూడా కలుగుతాయి.












Click it and Unblock the Notifications