రెగ్యులర్ గా టీ తాగుతున్నారా - అయితే, ఈ విషయంలో జాగ్రత్త...!!

ఉద‌యం నిద్ర లేచిన ద‌గ్గ‌ర నుంచి రాత్రి మ‌ళ్లీ ప‌డుకునే వ‌ర‌కు చాలా మంది టీ, కాఫీలు తెగ తాగేస్తుంటారు. అలసటగా అనిపించినా, ఫ్రెండ్స్‌తో కలిసి బయటికి వెళ్లినా టీ నే మొదటి ఛాయిస్. పని ఒత్తిడి నుంచి బయటపడి రిలాక్స్ అయ్యేందుకు టీ తాగుతుంటారు. అయితే వాస్త‌వంగా చెప్పాలంటే రోజూ మోతాదుకు మంచి టీ, కాఫీల‌ను తాగితే ఆరోగ్యానికి హాని చేస్తాయ‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. టీ, కాఫీల్లో ఉండే కెఫీన్ మ‌న‌కు హాని క‌లిగిస్తుంద‌ని వారు అంటున్నారు. అయితే, రోజుకు ఎంత మోతాదులో టీ తీసుకోవచ్చనేది స్పష్టత ఇస్తున్నారు.

మ‌న శ‌రీరానికి రోజుకు 400 మిల్లీగ్రాముల వ‌ర‌కు కెఫీన్ చాలు. అంత‌కు మించితే ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది. ఒక క‌ప్పు టీ లేదా కాఫీ తాగితే సుమారుగా 100 మిల్లీగ్రాముల మేర కెఫీన్ ల‌భిస్తుంది. టీ లేదా కాఫీ ఏదైనా స‌రే రోజుకు 4 క‌ప్పుల‌కు మించ‌కుండా తాగాల‌న్న‌మాట‌. టీ, కాఫీల‌ను అధికంగా తాగ‌డం వ‌ల్ల ఆందోళ‌న‌, ఒత్తిడి వంటి స‌మ‌స్య‌లు క‌లుగుతాయి. నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ప్ర‌భావితం అవుతుంది. కంగారుగా ఉంటారు. నిద్ర‌లేన‌ట్లు, విశ్రాంతి లేన‌ట్లు అనిపిస్తుంది. టీ, కాఫీల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో చేరే కెఫీన్ మెల‌టోనిన్ ఉత్ప‌త్తి కాకుండా అడ్డుకుంటుంది. ఇది నిద్ర హార్మోన్‌. రాత్రి పూట మ‌న శ‌రీరంలో ఈ హార్మోన్ ఉత్ప‌త్తి అవుతుంది. దీని వ‌ల్లే మ‌నం చీక‌టి ప‌డ‌గానే ఆటోమేటిగ్గా నిద్రిస్తాం. అయితే టీ, కాఫీల‌ను తాగ‌డం వ‌ల్ల వ‌చ్చే కెఫీన్ మెల‌టోనిన్ ఉత్ప‌త్తి కాకుండా చూస్తుంది. దీంతో రాత్రి అయినా కూడా నిద్ర ప‌ట్ట‌దు.

excessive-tea-intake-can-wreak-havoc-on-your-body-experts-opinions-here

టీ, కాఫీల‌ను అధికంగా తాగితే కొంద‌రికి దీర్ఘ‌కాలంలో జీర్ణాశ‌యంలో అల్స‌ర్లు ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. వీటిని అధికంగా సేవిస్తే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. కొంద‌రికి త‌ల‌నొప్పిగా ఉంటుంది. వికారంగా కూడా అనిపిస్తుంది. టీ, కాఫీల‌ను అధికంగా సేవించ‌డం వ‌ల్ల డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌తారు. మూత్ర విస‌ర్జ‌న‌కు త‌ర‌చూ వెళ్లాల్సి వ‌స్తుంది. ముఖ్యంగా రాత్రి పూట నిద్ర‌కు ఆటంకం క‌లుగుతుంది. ఈ పానీయాల‌ను అధికంగా సేవిస్తే శరీరం మ‌నం తినే ఆహారంలో ఉండే ఐర‌న్‌ను శోషించుకోలేదు. దీంతో ర‌క్త‌హీన‌త త‌లెత్తుతుంది. దంతాల‌పై ఉండే ఎనామిల్ పొర కూడా క్ర‌మంగా క్షీణిస్తుంది. బీపీ ఎల్ల‌ప్పుడూ ఎక్కువ‌గానే ఉంటుంది. క‌నుక టీ, కాఫీల‌ను అధికంగా తాగుతున్న‌వారు ఇప్ప‌టికైనా వాటిని తాగ‌డాన్ని త‌గ్గిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+