Banana: ఉదయం, రాత్రి అరటి పండు తింటున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..!
మనకు విరిగా లభించే పండ్లలో అరటి పడ్డు ఒకటి. ఈ అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నీషియం, కాపర్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు వంటి అన్ని రకాల పోషకాలు ఉంటాయి. వీటి వల్ల శరీరానికి అనేక లాభాలు ఉన్నాయి. అయితే ఈ అరటి పండ్లను ఎప్పుడు తింటే మంచిది.. ఉదయం తినాలా లేక రాత్రి తినాలా లేక ఎప్పుడుపడితే అప్పుడు తినాలా.. అంటే..

ఎసిడిటీ
ఎసిడిటీని నివారించడానికి ఉదయాన్నే అరటిపండ్లు తినడం ఉత్తమమని పోషకాహార నిపుణురాలు చెబుతున్నారు. కాగా చాలా మంది అరటిపండ్లను ఉదయాన్నే తినడానికి వెనకాడుతుంటారు. నిజానికి అరటిపండ్లు అసిడిటీ ఉన్నవారు ధైర్యంగా తినగలిగే ఆహారమని చెబుతున్నారు. ఎందుకంటే దాని నుంచి యాసిడ్ రిఫ్లక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఎసిడిటీని నివారించడానికి అరటిపండ్లు ఎంతగానో ఉపయోగపడతాయట.

దగ్గు, జలుబు
అరటి పండు దగ్గు, జలుబు, ఆస్తమా, సైనస్ వంటి సమస్యలు ఉన్నవారు మాత్రం రాత్రిపూట అరటిపండుకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రపోయే ముందు అరటిపండు తినడం వల్ల శ్లేష్మం పెరిగే ప్రమాదం ఉంది. ఫలితంగా సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందట. అరటిపండ్లు మలబద్దకాన్ని నివారించడానికి కూడా గొప్పగా ఉపయోగపడతాయి.

నీళ్లు
ఉదయం పరగడుపున గ్లాస్ లేదా రెండు గ్లాసుల నీటిని తాగిన తర్వాత అరటిపండ్లను తింటే మంచిదట. అరటిపండ్లకు బదులుగా నల్ల ఎండుద్రాక్ష లేదా బాదం పప్పులను కూడా తినొచ్చట. అయితే రాత్రి సమయంలో మెటబాలిజం స్థాయి తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, అరటిపండు తినడం వల్ల బరువు పెరిగి ఊబకాయం వచ్చే సమస్యలు ఉన్నాయి. పైగా అరటిపండ్లు జీర్ణం కావడానికి సమయం తీసుకుంటుంది. కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు అరటిపండుకు దూరంగా ఉండడమే మంచిదట.
మన శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్ సి, విటమిన్ బి 6 తో సహా ఎన్నో ఇతర ముఖ్యమైన ఖనిజాలు, ఫోలేట్ మొదలైనవి అరటిపండ్లలో పుష్కలంగా ఉంటాయి. ఇవి మనకు తెలియని ఎన్నో ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అరటి పండ్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. రోజుకు ఒక అరటిపండును తింటే చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉండదు. ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతాయి.












Click it and Unblock the Notifications