వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Benefits of betel leaf: భోజనం చేసిన తర్వాత తమలపాకు తింటున్నారా..!

|
Google Oneindia TeluguNews

చాలా మంది భోజనం చేసిన తర్వాత తమలపాకులు తింటుంటారు. అయితే ఈ తమలపాకులు తినడం మంచిదేనా.. అంటే మంచిదే అని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయట. చిన్న దగ్గు నుంచి పెద్ద సమస్య వరకు అన్నింటినీ దూరం చేసే శక్తి తమలపాకులకు ఉందని వివరిస్తున్నారు. భోజనం చేసిన తర్వాత తమలపాకులు తింటే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుందని చెబుతున్నారు.

pH స్థాయులు

pH స్థాయులు

తమలపాకులో విటమిన్ సి, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, కెరోటిన్ వంటి విటమిన్లతో పాటు క్యాల్షియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఈ తమలపాకు శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కడుపు, ప్రేగులలో pH స్థాయులను క్రమబద్ధీకరించడానికి ఉపయోగపడతాయి. తమలపాకు ఒక అద్భుతమైన నొప్పి నివారిణిగా పని చేస్తుందట. ఇది వంటి నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం కలిస్తుంది.

ఉదయాన్నే పరగడుపున తమలపాకులను

ఉదయాన్నే పరగడుపున తమలపాకులను

ఉదయాన్నే పరగడుపున తమలపాకులను తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను ఉన్నాయట. ఖాళీ కడుపుతో తమలపాకును తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మీకు కడుపు సమస్యలు ఉంటే మీరు ఖాళీ కడుపుతో తమలపాకును తింటే మంచిద. ప్రతిరోజూ ఉదయాన్నే తమలపాకులను తినడం వల్ల పోషకాల లోపాలను దూరం చేసుకోవచ్చట. ఛాతీ, ఊపిరితిత్తులు, ఆస్తమాతో బాధపడేవారికి తమలపాకు అద్భుతమైన ఔషధంగా పని చేస్తుంది.

గుండె నొప్పి సమస్యలు

గుండె నొప్పి సమస్యలు

తమలాపాకులపై కొద్దిగా ఆవాల నూనెను రాసి, వేడి చేసి ఛాతీపై ఉంచితే గుండె నొప్పి సమస్యల బారి నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. తమలపాకుల్లో క్రిమినాశక గుణాలు ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తమలపాకులను తింటే ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకదట. కీళ్ల నొప్పులతో బాధపడేవారు తమలపాకు తింటే కాస్త ఉపశమనం లభిస్తుందట. తమలపాకుల్లో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి.

చక్కెర స్థాయిలు

చక్కెర స్థాయిలు

తమలపాకులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ఇటీవల పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.
తమలపాకు ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో ఉపయోగపడుతుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్‌ను అదుపు చేయకపోవడం వల్ల కలిగే మంటను కూడా నివారిస్తుందట.

English summary
Many people eat betel leaves after meals. But experts say that it is good to eat these betel leaves. Because betel leaves have many medicinal properties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X