Piles: పైల్స్ రావడానికి ఈ అలవాట్లే కారణం.. వెంటనే మానుకోండి..
ప్రస్తుత జీవన విధానంతో చాలా మంది పైల్స్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒక్కసారి పైల్స్ వస్తే నరకయాతన ఉంటుంది. ఒకే చోట కదలకుండా కూర్చోలేక.. సరిగ్గా నడవలేక.. బాధపడుతుంటారు. పైల్స్ అనేది పురీషనాళం లోపల సిరల వాపు వల్ల ఏర్పడితే వస్తుంది. దీనిని హెమోరాయిడ్స్ అని కూడా అంటారు. ఎక్కువగా 40 ఏళ్లు పైబడిన వారు ఈ సమస్యతో బాధపడుతున్నారు.

ప్రేగు క్యాన్సర్
పైల్స్ సమస్యకు రక్తస్రావం ప్రధాన లక్షణం. రక్తస్రావం బాధాకరమైనది కానప్పటికీ, ఈ వ్యాధి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది, పేగు నియంత్రణ కోల్పోవడం, రక్తహీనత, ప్రేగు క్యాన్సర్ కూడా దారి తీసే అవకాశం ఉంది. పైల్స్ రావడానికి కొన్ని అలవాట్లు కారణమవుతాయి. అవి ఏమిటంటే..

బాత్‌రూమ్
బాత్‌రూమ్‌లో ఎక్కువ ఉండొద్దు. బలవంతంగా మల విసర్జన చేస్తే పైల్స్ సమస్య వచ్చే అవకాశం ఉంది.
సాధారణ ప్రేగు కదలికలకు ఫైబర్ అవసరం. తక్కువ ఫైబర్ తీసుకునే ఎవరైనా మలబద్ధకంతో బాధపడే అవకాశం ఉంది. మలబద్ధకం సమయంలో బలవంతంగా మల విసర్జన చేసేటప్పుడు మలద్వారంలోని సిరలు వాపుకు గురై పైల్స్ వచ్చే అవకాశం ఉంది.

సిరలు ఉబ్బి
చాలా మంది బయటికి వెళ్లినప్పుడు పబ్లిక్ రెస్ట్‌రూమ్‌లను ఉపయోగించడం మానేసి, ఇంటికి వచ్చే వరకు అలాగే బిగ పట్టుకుని ఉంటారు. ఇలా చేయడం వల్ల పైల్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందకంటే వచ్చినప్పుడే దగ్గరలో ఉన్న రెస్ట్ రూమ్ లకు వెళ్లాలి. వెళ్లకుండా ఉండి ఇంటికొచ్చిన తర్వాత మలవిసర్జన చేస్తే సిరలు ఉబ్బి పైల్స్ వస్తుంది.

నీరు
ఒకరి శరీరంలో తగినంత నీరు లేకుంటే మలబద్ధకం ఏర్పాడుతుంది. తద్వారా పైల్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే టీ, కాఫీ లేదా కార్బోనేటేడ్ పానీయాలు తక్కువగా తీసుకుని నీరు ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఊబకాయం కూడా పైల్స్ దారి తీసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications