ఉపవాసం ఇలా చేస్తే ఎన్నో ప్రయోజనాలు - ఈ పొరపాట్లు చేయద్దు..!!

ఉపవాసం గొప్ప ఔషధం. శరీరంలో నిత్యం పోరాటం చేసే అవయవాల పై ఒత్తిడి తగ్గించి ఆరోగ్యం అందిస్తుంది. ఆధ్మాత్మికంగా ఉపవాసం వారంలో ఏదో ఒక రోజు పాటిస్తూ ఉంటారు. అయితే, ఇది సైన్స్ పరంగానూ ఆరోగ్యానికి ఎంతో మంచిది అని నిరూపితం అయింది. అదే సమయంలో ఉపవాసం పేరుతో కొందరు ఎన్నో మినహాయింపులు ఇచ్చేస్తారు. ఖచ్చితమైన నిపుణుల సూచన ల మేరకు ఉపవాసం ఉంటే ఆరోగ్య పరంగా ప్రయోజనాలు అందుతాయి. అదే సమయంలో కొందరికి ఈ ఉపవాసం మంచిది కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఉపవాసంలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. వారంలో ఒక రోజు ఉపవాసం ఉండటం ద్వారా అద్బుతమైన లాభాలు ఉన్నాయి. ఇది సైన్స్ పరంగానూ నిరూపితం అయింది. ఉపవాసం కనీసం 12 గంటలు ఉండాలి. దీని కారణంగా కొవ్వు క‌రిగే ప్ర‌క్రియ పెరుగుతుంది. ముఖ్యంగా పొట్ట, తొడ‌ల ద‌గ్గ‌ర ఉండే కొవ్వు క‌రుగటానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా శరీర బరువు తగ్గుతుంది. ఏదైనా ఒక రోజు వారంలో ఉప‌వాసం చేస్తే ఆక‌లి హార్మోన్లు నియంత్ర‌ణ‌లోకి వస్తాయని నిపుణులు చెబుతు న్నారు. కాగా, ఉపవాసం కారణంగా క్లోమ గ్రంధి పైన ఒత్తిడి తగ్గి.. శ‌రీరం ఇన్సులిన్‌ను స‌మ‌ర్థ‌వం తంగా ఉప‌యోగించుకుంటుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తాయి. అయితే డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఫాస్టింగ్ చేసే స‌మ‌యంలో మందుల‌ను వాడ‌కూడ‌దు. లేదంటే షుగ‌ర్ లెవ‌ల్స్ మ‌రీ అధికంగా ప‌డిపోతే మరింత సమస్యగా మారుతుంది. ఉపవాసం వలన మంచి కొలెస్ట్రాల్ పెరగ టం తో పాటుగా.. ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి.

fasting-one-day-in-a-week-helps-for-any-health-benefits-as-experts

దీని ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వారంలో ఒక రోజు ఉప‌వాసం ఉంటే శ‌రీరం త‌న‌కు తాను అవసరమైన మార్పులు చేసుకొనే వెసులుబాటు కలుగుతుంది. అవ‌య‌వాలు మ‌ళ్లీ పున‌రుత్తేజం చెంది యాక్టివ్‌గా మారుతాయి. మెద‌డు ఆరోగ్యంగా ఉంటుంది. నీర‌సం, అల‌స‌ట దూరం అవుతాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు లేదా పాలిచ్చే త‌ల్లులు ఉప‌వాసం ఉండ‌డం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టైప్ 2 డ‌యాబెటిస్ ఉంటే డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు మాత్రమే ఉప‌వాసం చేయాలి.టైప్ 1 డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఉప‌వాసం చేయ‌వద్దని నిపుణులు తేల్చి చెబుతున్నారు. కిడ్నీ, లివ‌ర్ వ్యాధులు ఉన్న‌వారు, గుండె జ‌బ్బులు ఉన్న‌వారు, బీపీ మందుల‌ను తీసుకుంటున్నవారితో సహా పోష‌కాహార లోపం ఉన్న‌వారికి ఉపవాసం మంచిది కాదు. ఉప‌వాసం ఉన్న స‌మ‌యంలో నీళ్ల‌ను అధికంగా తాగాలి. ఆక‌లికి త‌ట్టుకోలేక‌పోతే తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపిన నీళ్ల‌ను తాగుతుండాలి. లేదా కేవ‌లం పండ్ల‌ను మాత్ర‌మే తినాలి. ఇలా ఉప‌వాసం చేస్తే చ‌క్కని ఫ‌లితం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+