Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

FOFO: యూత్ లో పెరుగుతున్న భయం. కొత్తరకం ఫోబియాతో ఆందోళన

యూత్ లో కొత్త తరం ఆందోళన "ఫియర్ ఆఫ్ ఫైండింగ్ అవుట్" (Fear of Finding Out) క్లుప్తంగా, FOFO. దీని ప్రభావం ఇప్పుడు సమాజంలో విస్తృతంగా పెరుగుతోంది. గతంలో "ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్" (FOMO) ఆందోళన ప్రధానంగా ఉండేది, కానీ ఇప్పుడు దాని స్థానాన్ని FOFO ఆక్రమిస్తోంది. ఈ ఆధునిక ఆందోళన అంటే ఏమిటి, అది మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తోంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

సమాచారం వేలిముద్ర దూరంలో ఉన్న ఈ డిజిటల్ యుగంలో, సత్యాన్ని తెలుసుకోవాలంటే చాలా మంది భయపడుతున్నారంటే అది విడ్డూరంగా అనిపించవచ్చు. అయితే, మానసిక నిపుణులు, జీవనశైలి నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ FOFO ఆందోళన డిజిటల్ శకంలో ఒక ప్రధాన సమస్యగా వేగంగా రూపాంతరం చెందుతోంది. నిజానికి, ఈ భయం చాలా వేగంగా వ్యాపిస్తోంది ప్రస్తుతం యూత్ లో.

Fear of Finding Out The Psychology Behind Avoiding Reality

FOFO అంటే ఒక నిర్దిష్ట సమాచారం ద్వారా బయటపడే విషయాల పట్ల భయపడి, ఆ సమాచారాన్ని తెలుసుకోవడానికి చూపించే నిరాసక్తత. ఉదాహరణకు, మెడికల్ రిపోర్ట్స్, బ్యాంకు బ్యాలెన్స్, వర్క్ రివ్యూ, లైఫ్ పార్టనర్ ఫీలింగ్స్ వంటివి ఇందులో ఉండవచ్చు. సత్యాన్ని తెలుసుకోవడం వల్ల తీవ్రమైన భావోద్వేగం, లైఫ్ స్టైల్లో మార్పులు.. లేదా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందనే అపోహే దీనికి మూలం.

FOFO ఎందుకు పెరుగుతోంది?

మనం జీవిస్తున్న ప్రపంచంలో గుండె కొట్టుకునే వేగం,మంచి నిద్ర, ఫైనాన్షియల్ కంట్రోల్, రిలేషన్స్ వంటి ప్రతి అంశాన్ని ట్రాక్ చేయవచ్చు. అయితే, మనం చూడాలని కోరుకోనివి కనిపించినప్పుడు, మనం ఒక విధమైన ఫోబియాకు గురవుతున్నాం. ఇది FOFO కు దారితీస్తుంది.

విచిత్రంగా అనిపించినా, స్థిరమైన నిర్ధారణ కంటే అనిశ్చితియే కొన్నిసార్లు సురక్షితంగా అనిపిస్తుంది ప్రస్తుత యువతరానికి. తెలియకపోతేనే మంచిది కదా అనే ధోరణి పెరుగుతుంది. ఈ విధంగా FOFO అజ్ఞానాన్ని ఎక్కువగా వ్యాప్తి చేస్తుంది. ఫలితంగా కలిగే తాత్కాలిక రిలిఫ్ హాయినిస్తుంది. ఇదే ఈ ఫోబియా ముఖ్య లక్ష్యం

కరోనా తర్వాత చాలా మంది మానసికంగా అలసిపోయారు. ఈ నేపథ్యంలో, సమాచారాన్ని నివారించడం అనేది సెల్ఫ్ కంట్రోల్ లో ఒక రూపంగా అనిపిస్తుంది, తద్వారా మరింత ఒత్తిడిని తగ్గించుకోవచ్చని భావిస్తారు.

ఏదైనా ఒక నిజం తెలిస్తే దాని పర్యవసానాలు ఎంత కఠినంగా ఉంటాయో అనే భాధ మరోవైపు. చికిత్స తీసుకోవడం, సంబంధాన్ని సరిదిద్దడం, ఖర్చు అలవాట్లను మార్చుకోవడం, లేదా వైఫల్యాన్ని ఎదుర్కోవడం వంటివి. ఈ FOFO ఆ చర్యలను వాయిదా వేసేలా చేస్తుంది. దీని ద్వారా పరిస్థితి ఎంత దిగజారినా సరే.. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం కదా తర్వాత చూసుకుందాంలే అనే భావనలోకి నెట్టేస్తుంది.

రోజువారీ జీవితంలో FOFO ఎలా కనిపిస్తుంది?

FOFO బయటికి పెద్దగా కనిపించదు;. ఇది చిన్న చిన్న, వ్యక్తిగత క్షణాలలో దాగి ఉంటుంది. ఉదాహరణకు:

  • ఆరోగ్యం: మెడికల్ రిపోర్ట్స్ చూపించకపోవడం, స్క్రీనింగ్‌లను ఎగ్గొట్టడం, చెకప్ లకు వెళ్లకపోవడం.
  • డబ్బు: బ్యాంకు స్టేట్‌మెంట్‌లను తనిఖీ చేయకపోవడం, గడువు ముగిసిన నోటిఫికేషన్‌లను విస్మరించడం.
  • వృత్తి: వర్క్ రివ్యూ లను నెగ్లెట్ చేయడం. నిర్ణయాలు తీసుకోకపోవడం.
  • సంబంధాలు: కఠిన నిజాలను అడగకుండా దాటవేయడం.
  • విద్యాభ్యాసం: పరీక్షల మార్కులు లేదా అసైన్‌మెంట్ రిపోర్ట్స్ ను చూడటానికి ఇష్టపడకపకోవడం.

FOFO చాలా గమ్మత్తయినది ఎందుకంటే, ఆ క్షణానికి అది ఉపశమనాన్ని ఇస్తుంది, కానీ దాని దీర్ఘకాలిక మానసిక ఖర్చు చాలా ఎక్కువ. ఈ ప్రవర్తన వల్ల సమస్యలు పెరుగుతాయి, ఆందోళన తీవ్రమవుతుంది, మరియు వాటిని పరిష్కరించడానికి అవసరమైన ప్రయత్నం సమయం గడిచేకొద్దీ పెరుగుతుంది. ఇది కేవలం తాత్కాలికంగా మాత్రమే సమస్యను పక్కన పెడుతుంది కానీ దీర్ఘకాలికంగా పరిష్కారం ఇవ్వదు.

FOFO ప్రమాదకరమా?

FOFO ఆరోగ్యం లేదా ఆర్థిక నిర్ణయాలలో జోక్యం చేసుకున్నప్పుడు ప్రమాదకరంగా మారవచ్చని పరిశోధకులు అంటున్నారు. వైద్య ఫలితాలను నివారించడం చికిత్సను ఆలస్యం చేయవచ్చు. రుణ సమాచారాన్ని నివారించడం ఆర్థిక సమస్యలను పెంచవచ్చు. భావోద్వేగ సత్యాన్ని నివారించడం సంబంధాలను దెబ్బతీయవచ్చు. అందరికంటే ముఖ్యంగా, FOFO ఒక చక్రంలా పనిచేస్తుంది. తర్వాత చూద్దాంలే అనే థాట్ తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది, కానీ టైం వచ్చినప్పుడు మొదడు నరాలు చిట్లిపోయే అంత ఆందోళనకు గురి చేస్తుంది.

దీనికి విరుగుడు నిపుణుల అభిప్రాయం ప్రకార.. సాఫ్ట్ రిసివింగ్. కొంచం కొంచం తెలుసుకోవడం, సపోర్ట్ అడగటం, సెల్ఫ్ కంట్రోల్ ద్వారా అన్నింటిని యాక్పెట్ చేయడం. ఈ పద్ధతుల ద్వారా FOFO ప్రభావాలను తగ్గించుకోవచ్చు మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+