రోజూ రెండు రెబ్బలు తినండి- చెడు కొలెస్ట్రాల్ కు చెక్, గుండె పదిలం..!!
వెల్లుల్లి. ప్రతీ ఇంటా ఉంటుంది. ఆహార పదార్ధాలకే కాదు.. ఆరోగ్య పరంగా వెల్లుల్లికి ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఆధునిక వైద్య విధానంలోనూ వెల్లుల్లికి ఉన్న ప్రత్యేకత గుర్తించారు. ప్రతీ రోజూ ఉదయాన్నే పరగడుపున ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బల్ని తినటం వల్ల బోలెడన్నీ లాభాలు ఉన్నాయి. వెల్లుల్లిని నమిలి తినడం ఇష్టం లేకపోతే నీటితో కలిపి మింగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి ముక్కల్ని తేనెలో కలిపి తీసుకోవచ్చు. ఈ రెండిటీని కలిపి తీసుకోవడం వల్ల గుండె నాళాలు ఆరోగ్యంగా మారుతాయి.
వెల్లుల్లి శరీరంలో రక్తపోటును తగ్గించడానికి దోహదం చేస్తుంది. వెల్లుల్లి రక్తనాళాలను రిలాక్స్ చేసి, మన బీపీని సహజసిద్ధంగా తగ్గిస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచే గుణం వెల్లుల్లిలో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఉదయం పూట పరగడుపున వెల్లుల్లిని రెండు రెబ్బలు తీసుకుంటామో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది మన గుండె సంబంధిత రిస్క్ రాకుండా కాపాడుతుంది. బ్లాక్స్ ఏర్పడకుండా చేస్తుంది. వెల్లుల్లి ఇన్సులిన్ సెన్సిటివిటీ ని మెరుగుపరిచి, డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది . వెల్లుల్లిలో ఉండే అలిసిన్ మన ఇమ్యూనిటీని పెంచుతుంది. జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్లను తగ్గించే శక్తి వెల్లుల్లికి ఉంటుంది. వెల్లుల్లి మన శరీర బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. ఫ్యాట్ బర్నింగ్ యొక్క వేగాన్ని పెంచుతుంది. మన శరీరంలో మెటబాలిజంను పెంచుతుంది. వెల్లుల్లితో జీర్ణక్రియ మెరుగవుతుంది.

నిపుణుల సూచనలు
అదే విధంగా వెల్లుల్లి ఉదయం తీసుకోవాలంటే జాగ్రత్త అజీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. శరీరం డిటాక్సిఫై చేస్తుంది. వెల్లుల్లి కాలేయ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మన కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మరసంలో వెల్లుల్లి రెబ్బలు లేదా వెల్లుల్లి పేస్ట్ కలిపి తాగాలి. దీని వల్ల ధమనులు ఆరోగ్యంగా మారుతాయి. కొంతమందికి పచ్చి వెల్లుల్లి పడదు. అటువంటి వారు వెల్లుల్లిని వేయించి తినొచ్చు. వేయించిన వెల్లుల్లి బీపీని కంట్రోల్ చేస్తుంది. మొలకెత్తిన వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కండరాల్ని బలంగా ఉంచుతాయి. వెల్లుల్లి పొడి చేసుకొని ఆహార పదార్థాల్లో కలిపి తీసుకోవచ్చు. అయితే వెల్లుల్లిని పరగడుపున తీసుకోవాలి అనుకుంటే, ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. లేదంటే ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది.













Click it and Unblock the Notifications