గ్యాస్‌తో పని లేకుండా ఈ బ్రేక్ ఫాస్ట్ చేసుకోండి.. సూపర్ హెల్దీ..!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు, గ్యాస్ కొరత కారణంగా ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా ఇప్పటికే పలు ప్రధాన నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్స్, హాస్టళ్లు మూత పడుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. గ్యాస్ ను ఆచి తూచి వాడుకోవాలని పలువురు నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు మనకు పొద్దున్నే లేచిన దగ్గర్నుంచి టీ, కాఫీ, టిఫిన్, లంచ్ అంటూ గ్యాస్ ఆన్ చేయక తప్పని పరిస్థితి. ఇక టిఫిన్ లో ఇడ్లీ, దోశ, పూరీ, వడ లాంటివి తినడం అలవాటు. అయితే ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా బ్రేక్ ఫాస్ట్ లో దోశ, పూరి, వడ లాంటివి పక్కన పెట్టాలని సూచిస్తున్నారు. వాటికి బదులుగా సలాడ్స్, శాండ్ విచ్, స్ప్రౌట్స్, మిక్స్‌డ్ ఫ్రూట్స్, బ్రెడ్-జామ్, బాయిల్డ్ ఎగ్స్(ఎగ్ బాయిలర్‌లో ఉడికించినవి), జ్యూస్ లు తీసుకోవాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు. అటు గ్యాస్ ఆదాతో పాటుగా ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వివరిస్తున్నారు.

ఈ వేసవిలో ఇలాంటి బ్రేక్ ఫాస్ట్ లు వెంటనే జీర్ణం అవుతాయని తద్వారా శరీరం ఎక్కువ నీటిని కోల్పోకుండా కాపాడుకోవచ్చని సూచనలు చేస్తున్నారు. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో రాగి జావ లాంటివి కూడా తీసుకోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీలైనంత వరకూ స్టవ్ తో పనిలేకుండా ఫుడ్ ను సిద్ధం చేసుకోవాలని చెబుతున్నారు. మరి మీరు కూడా ఇలాంటి ఫుడ్ ట్రై చేయండి..













Click it and Unblock the Notifications