డిన్నర్ తర్వాత పడుకుంటున్నారా? ఈ పని మర్చిపోవద్దు!!
ప్రస్తుత సమాజంలో అనారోగ్యమైన జీవన శైలి కారణంగా ప్రజ లు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏ సమయానికి ఏం చేయాలి? అన్నది తెలియక, తెలిసినా పాటించక కోరి కోరి అనారోగ్యాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఆహారం తీసుకునే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించడం లేదు. సమయానుకూలంగా ఆహారం తీసుకోవడం చాలా మంది మర్చిపోయారు.
రాత్రి డిన్నర్ తర్వాత పడుకుంటే అనారోగ్యం
ఇక రాత్రిపూట డిన్నర్ ఎవరి ఇష్టం వచ్చిన సమయానికి వారు తింటున్నారు. అర్ధరాత్రి సమయంలో కూడా తింటున్న వారు లేకపోలేదు. అయితే రాత్రి వేళ డిన్నర్ చేసిన తర్వాత వెంటనే బెడ్ ఎక్కేస్తుంటారు. చిన్నపాటి వ్యాయామం కూడా చేయరు. ఇలా రాత్రిపూట డిన్నర్ చేసిన తర్వాత ఎటువంటి వ్యాయామం లేకపోతే అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

డిన్నర్ తర్వాత నడకతో బోలెడు బెనిఫిట్స్
డిన్నర్ చేసిన తర్వాత కచ్చితంగా కాసేపైనా నడవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రిపూట డిన్నర్ చేసిన తర్వాత నడవడం వల్ల జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుందని, మంచి నిద్ర పడుతుందని దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. డిన్నర్ తర్వాత కచ్చితంగా 15 నుంచి 20 నిమిషాలు నడవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయి.
డిన్నర్ తర్వాత నడకతో స్ట్రెస్ రిలీఫ్, సుఖ నిద్ర
శరీరంలో రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. కండరాలకు కూడా మేలు జరుగుతుంది. రాత్రివేళ జీర్ణవ్యవస్థ సహజంగా మందకొడిగా ఉంటుంది. కానీ డిన్నర్ తర్వాత నడవడం వలన ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అజీర్తి సమస్య తలెత్తదు. కొన్నిసార్లు ఒత్తిడి వల్ల కూడా రాత్రిపూట నిద్ర పట్టదు. అయితే రాత్రివేళ భోజనం చేసిన తర్వాత ఒత్తిడి తగ్గేందుకు కొద్దిసేపు నడక సహకరిస్తుంది.
డిన్నర్ తర్వాత నడకతో బీపీ, షుగర్ కంట్రోల్
మంచి నిద్ర పట్టేందుకు నడక ఉపయోగపడుతుంది. రాత్రి తిన్న తర్వాత నడవడం వల్ల బరువు తగ్గేందుకు కూడా అవకాశం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు డిన్నర్ చేసిన తర్వాత నడవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండి, షుగర్ ను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఇక డిన్నర్ చేసిన తర్వాత నడక బీపీని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications