పైకి 30 వేల రూపాయిల శారీ కట్టుకొస్తారు..ప్రైవేట్ పార్ట్స్ మాత్రం కంపు కొడతాయి (వీడియో)

సాక్షాత్తు ఒక వైద్యురాలు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రూ.30 వేలకు పైగా విలువైన చీరలు కట్టుకొని అందంగా ముస్తాబై నా దగ్గరకు వస్తారు. కానీ వాళ్ల ప్రైవేట్ పార్ట్స్ చూస్తే కంపుకొడతాయి. తీవ్ర దుర్ఘంధం వస్తాయి. - ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్‌లో గైనకాలజిస్ట్‌ అయిన ఒక డాక్టర్ చేసిన ఈ సంచలన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి.

ఆ వైద్యురాలు మహిళల వ్యక్తిగత పరిశుభ్రతపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. పైన అందంగా కనిపించడం కాదు.. మీ ప్రైవేట్ పార్ట్ కూడా మీ శరీరంలో భాగమే అని గుర్తించండి. అది అంటరాని పార్ట్ కాదు. టాయిలెట్‌కు వెళ్ళినప్పుడు, స్నానం చేసే సమయంలో ప్రైవేట్ పార్ట్‌ను ప్రత్యేకంగా శుభ్రం చేసుకోవాలని ఆమె నొక్కి చెప్పారు.

Gynecologist s Shocking Comments on Female Hygiene Sparks Row Expensive Saree Smelly Private Parts

పురుషులతో పోలిస్తే మహిళలకు టాయిలెట్ ద్వారా ఎక్కువ ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఉందని, ముఖ్యంగా మోషన్ వెళ్ళినప్పుడు పరిశుభ్రంగా క్లీన్ చేసుకోవాలని సూచించారు. చిన్నపాటి మలం ఉన్నా బాక్టీరియా చేరి ఇన్‌ఫెక్షన్లు వస్తాయి అంటూ ఆమె తీవ్రంగా హెచ్చరించారు.

వైద్యపరంగా ఈ వ్యాఖ్యలు మహిళల ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో చేసినట్లు స్పష్టమవుతోంది. వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్లు , యోని ఇన్‌ఫెక్షన్లు వంటివి పెరిగే అవకాశం ఉంది. ఈ ఇన్‌ఫెక్షన్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

అయితే, ఈ వైద్యురాలి వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గం నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు: ఓ మహిళా వైద్యురాలు అయ్యుండి ఇంత దారుణంగా మాట్లాడుతారా? అని ప్రశ్నిస్తున్నారు. ఆ డాక్టర్ ఉపయోగించిన పదజాలంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి వ్యాఖ్యలు మహిళలను అవమానించే విధంగా ఉన్నాయని వారు వాదిస్తున్నారు.

మరో వర్గం నెటిజన్లు మాత్రం డాక్టర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు: పైన పటారం.. లోన లొటారం అంటూ కామెంట్ చేస్తున్నారు. పైకి అందంగా కనిపిస్తే సరిపోతుందా? వ్యక్తిగత శుభ్రత పాటించాలి కదా! వీళ్ల అపరిశుభ్రత వల్ల భర్తలకు కూడా వైరస్ సంక్రమిస్తాయి అంటూ డాక్టర్ చెప్పిన దాంట్లో నిజముందని, అవగాహన కల్పించడం తప్పు కాదని వాదిస్తున్నారు. ఆరోగ్యం విషయంలో మొహమాటం పనికిరాదని, కఠినంగా చెప్పినా అది ప్రజల మంచికే అని అభిప్రాయపడుతున్నారు.

ఈ సంఘటన మహిళల వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య అవగాహన, మరియు పబ్లిక్ ఫోరమ్‌లో సున్నితమైన విషయాలను ఎలా ప్రస్తావించాలనే అంశాలపై విస్తృత చర్చకు దారితీసింది. వైద్యులు చెప్పే విషయాల్లో నిజమున్నా, వాటిని ప్రజలకు చేరవేసే విధానం కూడా ముఖ్యమని ఈ ఉదంతం నిరూపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+