లిచీ.. ఆరోగ్యానికి మాలచ్చి: తిన్న కొద్దీ తిన బుద్ధవుతుందండి

లిచీ.. వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఎన్నో ఉన్నాయి. ఇందులో పీచు పుష్కలంగా ఉంటుంది. సక్రియ జీర్ణవ్యవస్థకు ఎంతగానో మేలు చేస్తుంది. ఇది ప్రేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సీ అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.

ఈ వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు చాలా అవసరం. ఈ పండులో నీరు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.

తక్కువ కేలరీలు, అధిక నీటి శాతం ఉండటం వల్ల బరువు తగ్గడానికి లిచీ తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మం పాలిపోవడాన్ని తగ్గిస్తాయి. అలాగే- అధిక నీటి శాతం.. శరీరాన్ని హైడ్రేట్ ఉంచుతుంది. ఫలితంగా- చర్మం కాంతివంతంగా ఉంటుంది.

లిచీలోని విటమిన్ సీ.. మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని దృఢంగా, మృదువుగా, కాంతివంతంగా ఉంచుతుంది. కొల్లాజెన్ చర్మ ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది.

లీచీలో ఉండే విటమిన్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. మంటను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించగలవు. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతగానో మంచిది. పొటాషియం సమృద్ధిగా ఉండే లీచీ వంటి పండ్లు శరీరంలోని సోడియం స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ఇది రక్తపోటును ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచడానికి సహాయపడుతుంది.

లిచీలో కాపర్, ఐరన్ అధికం. ఇవి మన శరీరంలో ఉండే ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చెందడానికి సహాయపడతాయి. రక్త ప్రసరణను మరింత మెరుగుపరుస్తుంది. అధిక పొటాషియం, తక్కువ సోడియం ఉండటం వల్ల రక్తపోటును అదుపులో ఉంటుంది. హైబీపీ ఉన్న వాళ్లు దీన్ని తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఉంటాయి.

ఐరన్, కాపర్, కాల్షియం, ఇతర ఖనిజాలు అధికంగా ఉండటం వల్ల లిచీ.. ఎముకలను ధృడంగా ఉంచగలుగుతుంది. వయస్సు మీద పడుతూ వస్తుండటం వల్ల సహజంగానే ఎముకలు పెళుసుగా మారుతుంటాయి. అలాంటి పరిస్థితిని నివారించడంలో సహాయపడుతుంది లిచీ ఫ్రూట్.

ఈ పోషకాలు ఎముకలను దృఢంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కణాలకు కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. ఇది సమగ్ర ఆరోగ్యాన్ని పెంపొందించే అద్భుతమైన ఔషధంగా పని చేస్తుంది. పులుపు, తీపి, వగరు వంటి రుచులు ఉంటాయి లిచీలో. తినడానికీ బాగుంటుంది.

Disclaimer: లిచి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యకర ప్రయోజనాలను పాఠకులకు తెలియజేయడమే ఈ కథనం ఉద్దేశం. దీని గురించి సమగ్ర సమాచారం గురించి డాక్టర్లు, డైటీషియన్లను సంప్రదించగలరు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+