ఈ సీడ్స్.. హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే వదలరు బాస్

గుమ్మడి గింజలు (Pumpkin Seeds) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో మెగ్నీషియం, జింక్, హెల్తీ ఫ్యాట్.. వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి వీటిని ప్రతిరోజు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. జుట్టు రాలడాన్ని కూడా ఇది అరికట్టగలుగుతుంది.

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కాల్షియం లోటును ఇది భర్తీ చేస్తుంది. ఫలితంగా ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది.

పంప్ కిన్ సీడ్స్ లల్లో జింక్ శాతం అధికంగా ఉంటుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గాయాలు త్వరగా మానడానికి, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. జింక్ రోగ నిరోధక లోపాలను నియంత్రించడంలో కూడా ఈ గుమ్మడి గింజలు కీలక పాత్ర పోషిస్తాయి.

గుమ్మడి గింజలలో ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండెకు చాలా మంచివి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. వీటిల్లో ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం ఉంటుంది. ఇది మంచి నిద్రను కలిగిస్తుంది. మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవచ్చు. మానసిక ఆందోళన తగ్గుతుంది.

నిద్రపోయే ముందు గుమ్మడి గింజలు తింటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గుమ్మడి గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

పంప్ కిన్ సీడ్స్.. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది. గుమ్మడి గింజల్లో కెరోటినాయిడ్స్, విటమిన్ ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. శరీరంలో మంటను తగ్గిస్తాయి. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

గుమ్మడి గింజలు తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి.

గుమ్మడి గింజల్లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గుమ్మడి గింజల్లోని ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు, జింక్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, జుట్టును బలంగా చేయడానికి సహాయపడతాయి. ఈ పోషకాలు మొటిమలను తగ్గిస్తాయి. చర్మం పొడిబారకుండా కాపాడుతాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+