వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Eggs: చలికాలంలో ఎక్కువగా కోడి గుడ్లు తింటున్నారా.. ! అయితే ఈ వార్త మీ కోసమే..

|
Google Oneindia TeluguNews

చలి కాలం వచ్చిందంటే చాలు జలుబు, దగ్గు సమస్యలు వస్తాయి. ఈ సమస్యల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. ఈ ఆహారంలో భాగంగా గుడ్డు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. గుడ్లలో చాలా రకాల పోషక పదార్ధాలు ఉంటాయని వివరిస్తున్నారు. గుడ్లను ఫ్రై చేసి తినేకంటే..ఉడకబెట్టి తినడం మంచిదని చెబుతున్నారు.

బాయిల్డ్ ఎగ్స్‌

బాయిల్డ్ ఎగ్స్‌


బాయిల్డ్ ఎగ్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. శరీరంలోని అంగాలకు బలం చేకూరుస్తుంది. గుడ్లు రోజూ తినడం వల్ల శరీరంలో అంతర్గతంగా వేడి పెరుగుతుంది. గుడ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి అనేది శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఎముకల్ని పటిష్టం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఫ్యాటీ యాసిడ్స్

ఫ్యాటీ యాసిడ్స్


గుడ్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కోలీన్ పెద్దమొత్తంలో ఉంటాయట. ఇవి మెదడులో సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. చలికాలంలో సహజంగా అధికంగా కన్పించే గుండెపోటు ముప్పు కూడా తగ్గిస్తాయట. ఎందుకంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాని నిపుణులు చెబుతున్నారు. కోడి గుడ్డులో విటమిన్స్, సెలీనియం, క్యాల్షియం, జింక్, ఇతర పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి.

కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్


డయాబెటిస్ ఉన్నవాళ్లు గుడ్డు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గుడ్డులో 200 మిల్లీగ్రాములు కొలెస్ట్రాల్ ఉంటుంది అయితే ఇలా తీసుకోవడం వల్ల డయాబెటిస్ వారికి మంచిది కాదట. ఉడకబెట్టిన గుడ్డు తింటే శరీరానికి 6.3 గ్రాముల ప్రొటీన్లు, 77 కేలరీలు, 212 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్, 0.6 గ్రాముల పిండి పదార్థాలు, 5.3 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు, అలాగే విటమిన్-ఎ, విటమిన్-బి2, విటమిన్-బి5, ఫాస్పరస్, సెలీనియం కూడా అందుబాటులో ఉంటాయి.

40 ఏళ్ల వయసులో

40 ఏళ్ల వయసులో


అందుకే చాలామంది గుడ్లు తినేందుకు చాలా ఇష్టపడతారు.ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం తీసుకుంటే శరీరం పూర్తి బలంగా తయారవుతుంది. బలహీనత మాయం అవుతుంది. అందుకే 40 ఏళ్ల వయసులో వారు రెగ్యులర్ డైట్‌లో గుడ్లను తప్పనిసరిగా చేర్చుకోవాలి. న్ని ఆరోగ్య ప్రయోజనాలు అందించే గుడ్డు విషయంలో అనేక మందికి అపోహలు, అనుమానాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా గుడ్డును ఏ విధంగా తింటే ఆరోగ్యానికి మంచిది.

ఎముకలు

ఎముకలు


40 ఏళ్లు దాటిన వారు కచ్చితంగా గుడ్డు తినాలట. వయస్సు పెరిగేకొద్దీ.. మధ్య వయస్సుకు చేరుకున్నప్పుడు సాధారణంగా ఎముకలు బలహీనపడటం ప్రారంభమవుతుంది. ఈ పరిస్థితుల్లో గుడ్లు తినడం మంచిది. పచ్చి గుడ్డును అనేక మంది తీసుకుంటారు. వీటిలో ముఖ్య కారణం బాడీ బిల్డింగ్, కండరాల కోసం వారు గుడ్డును పచ్చిగా తీసుకుంటారు. బాడీ బిల్డింగ్ కోసం పచ్చి గుడ్డును ఎక్కువగా షేక్స్, స్మూతీలలో వేసుకొని తాగుతూ ఉంటారు. ఎందుకంటే ఇది కండరాలను నిర్మించడానికి ఎక్కువ ప్రోటీన్ పొందడానికి మంచి మార్గంగా ఉంటుంది.

English summary
If the cold season has come, cold and cough problems will come. In order to protect ourselves from these problems, we have to eat foods that boost immunity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X