మారాం చేస్తున్నారని పిల్లలకు టీ/కాఫీ ఇచ్చేద్దురు.. అలవాటు చేయడం చాలా తప్పండి బాబూ
మన దేశంలో టీ, కాఫీ వినియోగం అధికం. చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో మొదలుపెట్టి, రోజంతా సేవిస్తారు. అది లేనిదే పొద్దు గడవదు చాలామందికి. పిల్లలు అడిగినప్పుడు చాలామంది తల్లిదండ్రులు ముందు వెనుకా ఆలోచించకుండా వారికి టీ/కాఫీ కప్ లను అందిస్తుంటారు. వారికి వీటిని ఇవ్వడం ఎంతమాత్రం సరికాదు. ప్రత్యేకించి- పదేళ్ల లోపు పిల్లలకు టీ, కాఫీ తాగే అలవాటు అస్సలు చేయకూడదు.
టీ, కాఫీ పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. వీటిలోని కెఫిన్ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపి, ఇతర పోషకాలను అడ్డుకుంటుంది. దీనివల్ల పిల్లల శారీరక ఎదుగుదల కుంటుపడుతుంది. ఇది చిన్న వయస్సులోనే వారి పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. టీ, కాఫీలలో ఉండే కెఫిన్ వల్ల పిల్లల్లో నిద్ర సమస్యలు తలెత్తుతాయి. కెఫిన్ మానసిక చురుకుదనంపై ప్రభావం చూపి, నిద్రను భంగపరుస్తుంది.

పగలు లేదా సాయంత్రం ఇవి తాగితే నిద్రకు ఆటంకం ఏర్పడి, తగినంత విశ్రాంతి లభించకపోవడం వంటి ఇబ్బందులు కలుగుతాయి. గుండె సంబంధిత సమస్యలు టీ, కాఫీ వినియోగంతో ముడిపడి ఉన్నాయి. కెఫిన్ గుండెకు హాని కలిగించి, రక్తపోటును పెంచుతుంది. అధిక రక్తపోటు నేరుగా గుండెను దెబ్బతీస్తుంది. కెఫిన్ ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను పెంచుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. పిల్లల్లోనూ ఈ ప్రమాదం ఉంటుంది.
టీ, కాఫీలు పిల్లల జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. వీటివల్ల మలబద్ధకం, వికారం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఖాళీ కడుపుతో టీ తాగడం వారి ఆహారపు అలవాట్లపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కెఫిన్ ప్రభావం పెద్దలకే పరిమితమని భావించడం పొరపాటు. పిల్లలపై మరింత తీవ్రంగా ఉంటుంది. టీ, కాఫీల్లో ఉండే కెఫిన్ పిల్లల నిద్ర అలవాట్లను దెబ్బతీస్తుంది. చిన్న మొత్తంలో కెఫిన్ అయినా, పిల్లల నిద్రా సమయాన్ని తగ్గిస్తుందని డాక్టర్లు అంటున్నారు.
తగినంత నిద్ర లభించకపోతే, అది పిల్లల శారీరక ఎదుగుదల, రోగనిరోಧಕ శక్తి, ప్రవర్తనను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. టీలో ఉండే టానిన్ వల్ల పిల్లలు తీసుకునే ఆహారంలోని ఐరన్‌ను శరీరం గ్రహించుకోకుండా అడ్డుకుంటుంది. ఇది కీలక పోషకాలకు అవరోధం. కడుపులో ఆమ్ల సమతుల్యత దెబ్బతిని, జీర్ణక్రియ సంబంధిత సమస్యలను, ముఖ్యంగా మలబద్ధకం వంటి వాటిని పెంచుతుంది. టీ, కాఫీలలో ఉండే థియోఫైలిన్ అనే సమ్మేళనం కూడా పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
కెఫిన్ పిల్లల మెదడును అతిగా ఉత్తేజపరుస్తుంది. ఇది అభివృద్ధి చెందుతున్న నాడీ వ్యవస్థకు ఆటంకం కలిగించి, చంచలత్వం, ఆందోళన, పాఠశాలలో ఏకాగ్రత లోపానికి దారితీస్తుంది. చాలా మంది పిల్లలు చక్కెర కలిపిన టీ, కాఫీలను తాగడానికి ఇష్టపడతారు. దీనివల్ల శరీరంలో అనవసరంగా కేలరీలు పెరిగిపోతాయి. పర్యవసానంగా, చిన్న వయస్సులోనే వారికి దంత సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు.
Disclaimer: పిల్లలు టీ/కాఫీ తాగడానికి అలవాటు పడటం వల్ల కలిగే దుష్రభావాల గురించి పాఠకులకు తెలియజేడయమే ఈ కథనం ఉద్దేశం.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications