health tips: డయాబెటిస్ ఉన్నవారు పైనాపిల్ తినొచ్చా?
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఏది పడితే అది తినకూడదు. ఏది తినాలన్నా కూడా దాని గురించి తెలుసుకొని, దాని వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందా ? అనేది తెలుసుకుని తినాలి. ముఖ్యంగా పండ్లను తినే విషయంలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పైనాపిల్ తినొచ్చా? ఇది చాలా మందికి కలిగే సందేహం. అయితే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పైనాపిల్ తింటే ఏమవుతుంది? ఎంత మోతాదులో తినాలి? వంటి అనేక అంశాలను ఇక్కడ తెలుసుకుందాం.మన శరీరానికి ఆరోగ్యం ఇచ్చే పండ్లలో పైనాపిల్ ఒకటి. పైనాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఎంజైములు పుష్కలంగా ఉంటాయి. పైనాపిల్ తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది.

అజీర్ణం వంటి సమస్యలు ఉన్నవారికి పైనాపిల్ అద్భుతంగా పనిచేస్తుంది. పైనాపిల్ కడుపులో మంటను తగ్గిస్తుంది. అయితే పైనాపిల్ డయాబెటిస్ బాధితులు తినొచ్చా? అంటే పరిమిత మోతాదులో తినొచ్చు అని చెబుతున్నారు న్యూట్రిషనిస్టులు.డయాబెటిస్ బాధితులు 100 గ్రాములు మించకుండా పైనాపిల్ తినవచ్చు. అంతకుమించి పైనాపిల్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి.
ఫలితంగా అది శరీరంలోని ఇతర అవయవాలపైన ప్రభావాన్ని చూపించి, కిడ్నీలు కళ్ళు, గుండె వంటి శరీర అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. పైనాపిల్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ 51 నుంచి 73 మధ్యలో ఉంటుంది. అందుకే దీనిని ఎక్కువగా తినకూడదు. ఒకవేళ డయాబెటిస్ బాధితులు దీనిని ఎక్కువ తింటే అది శరీరంలో దుష్ప్రభావాలను కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్త అవసరం.
డయాబెటిస్ బాధితులు తప్ప మిగతా వారు పైనాపిల్ నిరభ్యంతరంగా తినొచ్చు. పైనాపిల్ తినటం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. మధుమేహం ఉన్నవారు కొద్ది మోతాదులో తింటే రక్తంలో చెక్కెర స్తాయి తగ్గుతుంది. అదే ఎక్కువగా తింటే మాత్రం డేంజర్. ఒకవేళ తింటే మితంగా తినాలి. అంతకుమించి తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. డయాబెటిస్ బాధితులు ఈ నియమాలను పాటించలేకపోతే పూర్తిగా పైనాపిల్ ని తినడాన్ని పక్కన పెట్టండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications