health tips: ఈ ఆహారాలతో నిద్రలేమి సమస్యకు చెక్.. హాయిగా నిద్రపోండి!!
ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆహారంతో పాటు సరైన నిద్ర అవసరం. ప్రతిరోజు 7 గంటల నుండి ఎనిమిది గంటల పాటు నిద్రపోతే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే చాలామంది నిద్ర పట్టక తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. నిద్రలేమి సమస్యతో బాధపడుతూ రాత్రుళ్ళు నరకం చూస్తూ ఉంటారు. ఇక అటువంటివారు దైనందిన జీవితంలో కొన్ని ఆహారాలను తింటూ ఉంటే నిద్రలేమి సమస్య తగ్గుతుందని చెబుతున్నారు డైటీషియన్లు.
ఆహారంలో కొన్ని రకాల పదార్థాలను చేర్చుకోవడం వల్ల మరింత గాఢ నిద్ర పోవడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరి ఏ ఆహారాలతో నిద్ర పడుతుందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మనం తీసుకునే ఆహారంలో బాదంపప్పును చేర్చుకుంటే నిద్ర కచ్చితంగా పడుతుంది. అంతేకాదు మన ఆహారంలో చేపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా నిద్రలేమి సమస్య నుంచి గట్టెక్కవచ్చు.

మనం తీసుకునే ఆహారంలో పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కివి పండ్లు, చెర్రీస్, అరటి పండ్లు ఎక్కువగా తింటే మంచి నిద్ర వస్తుంది. అరటిపండ్లలో క్యాల్షియం, మెగ్నీషియం రెండు అధికంగా ఉండటం వల్ల ఇవి కండరాలకు విశ్రాంతినిచ్చి, హాయిగా నిద్రపోయేలా చేస్తాయి.
మనం తీసుకునే ఆహారంలో ఓట్స్ చేర్చుకోవడం వల్ల హాయిగా నిద్ర పడుతుంది. ఓట్స్ లో ఉండే ప్రోటీన్ మనం ఆరోగ్యంగా నిద్రపోవడానికి దోహదం చేస్తుంది. ఇక మూలికా టీలు, కాఫీ రెండు హాయిగా నిద్ర పోవడానికి దోహదం చేస్తాయి. ఇక డార్క్ చాక్లెట్ కూడా మన నిద్రకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే డార్క్ చాక్లెట్ అధిక వినియోగం మాత్రం మంచిది కాదు.
ప్రతిరోజు కొద్ది మొత్తంలో తేనెను ఆహారంలో భాగంగా చేసుకుంటే హాయిగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. పప్పులు ప్రోటీన్లకు అద్భుతమైన మూలకం కాబట్టి, మన ఆహారంలో పప్పులను ఎక్కువగా తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది. నిద్రకు పిల్స్ వేసుకునే పరిస్థితులకు గుడ్ బై చెప్పి, మనకు మంచి నిద్రను ఇచ్చే ఆహారాన్ని దైనందిన జీవితంలో అలవాటు చేసుకోవాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications