health tips: భరించలేని ఒత్తిడికి చెక్ పెట్టండి.. ఈ ఆహారాలు తీసుకోండి!!
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో నిత్యం మనం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. దీనివల్ల మన జీవితంలో ఒత్తిడి కూడా ఒక భాగమైపోయింది. ఒత్తిడి వల్ల అనేక శారీరక , మానసిక అనారోగ్యాలు కలుగుతాయి. తీవ్రమైన ఒత్తిడి కారణంగా మనిషి ప్రశాంత జీవనాన్ని గడపలేడు. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం, యోగా వంటివి చేయడంతో పాటు ఆహార నియమాలను కూడా పాటించాలి.
కొన్ని ఆహార పదార్థాలు ఒత్తిడిని తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఇక వాటిని గురించి మనం తెలుసుకుందాం. పోషకాహార నిపుణులు వేరుశనగ గుళ్ళు మన ఒత్తిడిని తగ్గించడానికి ఎంతో బాగా పనిచేస్తాయని చెబుతున్నారు. వేరుశనగలో మెగ్నీషియం, విటమిన్ b6 పుష్కలంగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని నిర్వహించడానికి సహాయపడతాయి.

వేరుశనగ గింజలను తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇక బాదం పప్పు తినడం వల్ల కూడా ఇక్కడి నుంచి ఉపశమనం లభిస్తుంది. బాదం పప్పు తినడం వల్ల మేధస్సు పెరగడంతో పాటు, మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇక అలసటగా ఉన్న సమయంలో జీడిపప్పును తినడం వల్ల ఇందులో ఐరన్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది .
ఇది శారీరకంగా బలంగా ఉంచి మానసిక రుగ్మతలను, ఒత్తిడిని తగ్గిస్తుంది. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం జీడిపప్పును క్రమం తప్పకుండా రాత్రివేళలో పాలల్లో కలుపుకొని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఒత్తిడిని తగ్గించే మరొక పదార్థం కొబ్బరి కొబ్బరిలో లారిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల జుట్టు మరియు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
ఇక లేత కొబ్బరిని తినడం వల్ల మన స్కాల్ప్ హైడ్రేటెడ్ గా ఉండి జుట్టుకు కావలసిన పోషణ అందుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను కొబ్బరి అదుపులో ఉంచుతుంది. ఇది మెదడును బలంగా ఉంచుతుంది. కనుక ఒత్తిడిని తగ్గించుకోవాలని భావించేవారు వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications