వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఈ 5 పండ్లు హాయిగా తినొచ్చు!!

|
Google Oneindia TeluguNews

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అతి భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధి మధుమేహం. ప్రపంచంలో ఉన్న సగం జనాభా మధుమేహ వ్యాధితో బాధపడుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగినా తగ్గినా అది ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా ఆహారం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏవైనా పండ్లు తినాలి అంటే తినొచ్చా.. తినకూడదా అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు కొన్ని పండ్లను హాయిగా తినొచ్చని చెబుతున్నారు వైద్యులు. ఐదు రకాల పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయని, వాటిని తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది కలగదు అని చెబుతున్నారు.

health tips:

మధుమేహ వ్యాధిగ్రస్తులు పీచ్ పండ్లను తినచ్చు పీచ్ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అది మధుమేహ వ్యాధి గ్రస్తులకు మేలు చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు నేరేడు పండ్లు తినవచ్చు. నేరేడు పండ్లను తినడం వల్ల మధుమేహం కంట్రోల్ అవుతుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేయడంలో నేరేడు పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. కనుక మధుమేహం వ్యాధిగ్రస్తులు నేరేడు పండ్లను యథేచ్ఛగా తినొచ్చు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు జామపండ్లను తినొచ్చు. ఎందుకంటే దీనిలో తక్కువ కేలరీలు మరియు ఫైబర్ రక్తంలోని చక్కెరను నియంత్రణలో ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు జామపండ్లను నిస్సంకోచంగా తినొచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు బొప్పాయి పండు తింటే మేలు జరుగుతుంది.ప్రతి రోజు బొప్పాయి పండ్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు తినడం వల్ల రక్తంలో చక్కెర కంట్రోల్లో ఉంటుంది.

health tips: మీ డైట్ లో మూడు ఆహారాలు చేర్చుకోండి.. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది!!health tips: మీ డైట్ లో మూడు ఆహారాలు చేర్చుకోండి.. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది!!

మధుమేహ వ్యాధిగ్రస్తులకు బొప్పాయి పండు ఒక అమృతఫలం అనే చెప్పొచ్చు. ప్రతి రోజూ ఒక ఆపిల్ తినడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. ఆపిల్ ఎవరు తిన్నా కూడా అందరికీ మేలు చేస్తుందని డయాబెటిస్ పేషెంట్ లకు యాపిల్స్ ప్రత్యేకంగా ఉపయోగపడతాయని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

English summary
Doctors say that diabetics can eat some fruits comfortably. It is said that five types of fruits are good for diabetics and there is no problem in eating them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X