health tips: ఆయుష్షుతో పాటు ఆరోగ్యం.. డబ్బు ఖర్చులేని సింపుల్ హెల్త్ సీక్రెట్స్!!
చాలామంది తాము ఆరోగ్యంగా ఉండటం లేదని బాధపడుతుంటారు. ఏం చేసినా ఆరోగ్యం రావడంలేదని మదన పడుతుంటారు. మరికొందరు వయసు పెరుగుతున్న కొద్దీ ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతూ ఉంటారు. బాధలు, ఆలోచనలు, ఆందోళనలు పక్కన పెట్టి ప్రతీ ఒక్కరూ చెయ్యాల్సిన చిన్న చిన్న పనులు ఉన్నాయి. అవి డబ్బుతో కూడుకున్న పనులు కూడా కాదు. ఇక వాటిని అనుసరిస్తే కచ్చితంగా ఆరోగ్యం మీ సొంతం అయ్యి తీరుతుంది. ఇక ఆయుష్షు తో పాటు ఆరోగ్యం కోసం ఆలోచించే వారి కోసం సింపుల్ చిట్కాలను ఇక్కడ మీకందిస్తున్నాం.

ఈ మూడే యువతలో అనారోగ్యాలకు కారణం
ఒక వ్యక్తి ఆరోగ్యం కానీ ఆయుష్షు కానీ వారి జీవన విధానం పై ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే ఆహారం, మన లైఫ్ స్టైల్ , శారీరక శ్రమ, మానసిక ఒత్తిడిని బ్యాలెన్స్ చేసుకోవడం వంటి అంశాలపై మన ఆరోగ్యంతో పాటు మన ఆయుష్షు కూడా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత సమాజంలో పరుగుల ప్రపంచంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకుండా పరుగులు పెడుతున్న యువత, సమయానికి నిద్ర పోరు. సమయం ప్రకారం భోజనం చెయ్యరు. శరీరానికి చేటు చేసే జంక్ ఫుడ్స్ తినటానికి అలవాటు పడుతున్నారు. శారీరక శ్రమ అసలే లేదు. తీరా అనారోగ్యాల బారిన పడిన తర్వాత ఆరోగ్యం కోసం వెంపర్లాడుతున్నారు.

ఈ మూడు పనులు క్రమపద్దతిలో చేస్తే ఆరోగ్యం, ఆయుష్షు
ఇక ఆ పరిస్థితి రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా పాటించవలసిన చిన్న చిన్న నియమాలు ఉన్నాయి. ఆ నియమాలలో మొదటిది వ్యాయామం చేయటం. రెండవది సరైన ఆహారం. మూడవది కంటి నిండా నిద్ర. ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడమే కాకుండా, మానసికంగానూ దృఢత్వం లభిస్తుంది. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం ఎంతగానో దోహదం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించడానికి వ్యాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు తమ జీవితంలో వ్యాయామం చేయడాన్ని ఒక భాగం చేసుకోవాలి.

నిద్ర, ఆహారం విషయంలో గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలివే
సరైన సమయానికి నిద్రపోవడం, అనవసరమైన ఆందోళనలు మనసుకు తీసుకోకుండా ఉండడం, ప్రశాంతంగా జీవించడానికి ప్రాధాన్యతనివ్వడం, ఉదయాన్నే సూర్యోదయాన వాకింగ్ చేయడం వంటి లక్షణాలు మనిషి ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతాయి. రోజూ కనీసం 8 గంటలైనా నిద్రపోవాలి. నిద్ర మనిషికి లేచిన తరువాత పని చేసే శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. తాము ఏం ఆహారం తీసుకుంటున్నాం? ఏ సమయానికి భోజనం చేస్తున్నాం? తాము తినే ఆహారంలో పోషకాలు ఎన్ని ? వంటి వివరాలను గుర్తించి తదనుగుణంగా ఆహారం తీసుకోవాలి. బయట జంక్ ఫుడ్స్ కు గుడ్ బై చెప్పాలి.

జీవనశైలి మార్పులతో మంచి ఆరోగ్యం... ఆపై మంచి ఆయుష్షు
వ్యాయామం, ఆహారం, నిద్ర మూడు విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు అని వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకుంటే రోగాల బారి నుండి బయటపడతారు. అంతేకాదు అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉన్నవారి ఆయుష్షు కూడా పెరుగుతుంది. అందుకే ఆయుష్షు, ఆరోగ్యం రెండూ కావాలంటే ఈ జీవన విధానం అలవాటు చేసుకోండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications