వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: బరువు తగ్గాలంటే ఇవే ప్రధానం: తెలుసుకోండి.. పాటించండి!!

|
Google Oneindia TeluguNews

చాలామంది విపరీతంగా బరువు పెరిగిపోయాయని బాధపడుతూ ఉంటారు. బాగా బరువు పెరిగే దాకా శరీరం పైన దృష్టి పెట్టరు. ఒకసారి బరువు పెరిగిన తరువాత, ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తేనే వెంటనే బరువు తగ్గాలని తెగ తపన పడి పోతూ ఉంటారు. బరువు తగ్గడం అనేది పెరిగిన అంత ఈజీ కాదు. బరువు తగ్గాలి అనుకునే వారు ముఖ్యంగా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.

బరువు తగ్గాలంటే ప్రధానంగా ఉండాల్సింది ఇదే

బరువు తగ్గాలంటే ప్రధానంగా ఉండాల్సింది ఇదే


బరువు తగ్గాలి అంటే కచ్చితంగా సమయం పడుతుంది. ఆహారం, వ్యాయామ నియమాలు పాటించడంతో పాటుగా అన్నిటికంటే ఓపిక ఉండాలి. మనం తగ్గించాలి అనుకుంటున్న శరీర బరువు ఒక్కరోజులో పెరిగింది కాదనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. సంవత్సరాల తరబడి పెంచిన బరువును, తగ్గించడానికి అంతే కష్టపడాల్సి వస్తుందని తెలుసుకోవాలి. ముఖ్యంగా బరువు తగ్గించుకోవాలని భావించేవారు ఒకటేసారి బరువు తగ్గాలని ప్రయత్నం చేయకుండా, నిదానంగా బరువు తగ్గడం పైన దృష్టి సారించాలి. ఒకటే సారి బరువు తగ్గాలని చేసే ప్రయత్నాలతో ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని గుర్తుంచుకోవాలి.

బరువు తగ్గాలంటే వదిలిపెట్టాల్సింది ఇదే

బరువు తగ్గాలంటే వదిలిపెట్టాల్సింది ఇదే


బరువు తగ్గాలని భావించేవారు ముందు వదిలి పెట్టాల్సింది బద్ధకం. బద్దకంగా కూర్చోడం, బద్ధకంగా ఉండడం. ఏదైనా పని చేయాలంటే బద్దకిస్తూ పని చేయకుండా మానుకోవడం వంటివి చెయ్య కూడదు. బరువు తగ్గాలనుకునే వారు ఉండవలసిన ప్రధానమైన లక్షణం బద్ధకాన్ని వదిలించుకోవడం. బద్దకాన్ని వదిలి పెడితే బరువు తగ్గుతారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బద్ధకంగా కూర్చోవడానికి బదులు తేలికైన వ్యాయామాలు చేసే ప్రయత్నం చేయాలి.

 బరువు తగ్గటం లో ఇవి రెండే ప్రధానం

బరువు తగ్గటం లో ఇవి రెండే ప్రధానం


వ్యాయామం బరువు తగ్గించటానికి ఎంతో ఉపయోగపడుతుంది. కండరాలను దృఢం చేసే వ్యాయామాలను కూడా చేస్తూ ఉండాలి. లిఫ్టులో ఇళ్లకు వెళ్లే బదులు, మెట్లెక్కి కాలినడకన వెళ్లే ప్రయత్నం చేయాలి. వేగంగా నడవడం, ఈత కొట్టడం, సైక్లింగ్ చేయడం, డాన్స్ చేయడం వంటి అన్ని శారీరక శ్రమకు తోడ్పడి బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నిత్యం వ్యాయామం చెయ్యటం బరువు తగ్గటానికి దోహదం చేస్తుంది. ఇక ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బరువు పెరిగే ఆహారాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా స్వీట్లు తినకూడదు. కాఫీ, టీ, కూల్ డ్రింక్ వంటివాటిని దూరంగా ఉంచాలి. రెడ్ మీట్ కు దూరంగా ఉండాలి. పండ్లు, పొట్టు ధాన్యాలు, తృణధాన్యాలు వంటి వాటిని తీసుకోవచ్చు.

బరువు తగ్గాలంటే క్రమశిక్షణతో కూడిన జీవన శైలి అవసరం

బరువు తగ్గాలంటే క్రమశిక్షణతో కూడిన జీవన శైలి అవసరం


ఆహారంలో కార్బోహైడ్రేట్ల కంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రొటీన్ ఎక్కువగా ఉన్నప్పుడు అది ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బరువు పెరగకుండా ఆపుతుంది. మనం తీసుకునే ఆహారం మితంగా తీసుకునేలా చూసుకోవాలి. సమయం ప్రకారం ఆహారం తినేలా జాగ్రత్తలు వహించాలి. ప్రతిరోజూ తప్పనిసరిగా నాలుగు నుండి ఐదు లీటర్ల మంచి నీటిని తీసుకోవాలి. క్రమశిక్షణతో కూడిన జీవన శైలి అలవాటు చేసుకుంటే బరువు తగ్గటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
It is said that in order to lose weight, it is important to be patient and not lazy along with exercise and diet. So they say to learn good health discipline and try patiently to loose weight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X