వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: పుదీనాతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు; రోజూ తీసుకుంటే దివ్యౌషధమే!!

|
Google Oneindia TeluguNews

పుదీనా.. ప్రకృతి ప్రసాదించిన, తాజాదనాన్ని ఇచ్చే, ఎన్నో ఆరోగ్య సుగుణాలు ఉన్న ఆకు. పుదీనాను నిత్యం ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బరువు తగ్గడానికి పుదీనా వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మంచి రుచితో పాటు సువాసన కూడా కలిగి ఉండే పుదీనా జ్యూస్ తీసుకోవడం వల్ల, పుదీనా ను టీ చేసుకుని తాగడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నేచురోపతి వైద్యులు చెబుతున్నారు.

 పుదీనాతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

పుదీనాతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు


పుదీనా ఆకులలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి-6 లతోపాటు, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి మినరల్స్, ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండడంతో ఇది మన జీవక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు పుదీనా వాటర్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఇక బరువు తగ్గడానికి, ముసలితనం త్వరగా రాకుండా ఉండడానికి పుదీనా వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

పుదీనాతో ఈ సమస్యలు పరార్

పుదీనాతో ఈ సమస్యలు పరార్

పుదీనా నీటిని తాగడం వల్ల మన శరీరానికి శక్తి లభించడమే కాకుండా చర్మ సంబంధమైన అనేక సమస్యలు తగ్గుతాయి. కళ్ళ క్రింద నలుపు తగ్గటానికి పుదీనా తో తయారు చేసిన లేపనం ఎంతగానో ఉపయోగపడుతుంది. మన శరీరంలో ఏర్పడిన మలినాలను తొలగించి జీర్ణక్రియను సాఫీగా చేయడానికి, జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేయడానికి పుదీనా ఎంతగానో ఉపయోగపడుతుంది. పుదీనాను పై పూతగా ఉపయోగించడం వల్ల కాలిన గాయాలు తగ్గుతాయి. శరీరంపై ఏర్పడ్డ దురద మరియు చర్మ సమస్యలకు పుదీనా నివారణగా ఉపయోగపడుతుంది. పుదీనాను మజ్జిగతో కలిపి తీసుకుంటే మన శరీరంలో వేడి తగ్గుతుంది.

పుదీనాతో అందం.. ఆరోగ్యం

పుదీనాతో అందం.. ఆరోగ్యం

పుదీనా ఆకులను మెత్తగా నూరి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా ప్రకాశవంతంగా మారుతుంది. మన అందాన్ని పెంచటంలో కూడా పుదీనా ఆకులది ప్రత్యేక స్థానం. అనేక చర్మ సమస్యలను నివారిస్తుంది. ముఖం పైన వచ్చిన మొటిమలను, మచ్చలను తగ్గించడంలో కూడా పుదీనా ఎంతగానో ఉపయోగపడుతుంది. పుదీనా దంత సమస్యలను, చిగుళ్ల సమస్యలను తగ్గిస్తుంది. పుదీనా నోటి దుర్వాసనకు చెప్పి చెక్ పెట్టి, దంతాలను తెల్లగా మెరిసేలా చేస్తుంది. ఉదయాన్నే నిమ్మరసం, తేనె, పుదీనా కలిపి తీసుకుంటే ఆరోగ్యాన్ని అది బాగు చేస్తుంది.

పుదీనాతో ఉత్సాహం.. పుదీనా జ్యూస్ అలసటకు చెక్ పెట్టే దివ్య ఔషధం

పుదీనాతో ఉత్సాహం.. పుదీనా జ్యూస్ అలసటకు చెక్ పెట్టే దివ్య ఔషధం

అధిక దాహం సమస్యకు చెక్ పెట్టడానికి పుదీనా వాటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పుదీనాతో రోగనిరోధక శక్తి మెరుగుపడటమే కాకుండా బరువు తగ్గడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది . పుదీనాతో ఊపిరితిత్తులు, శ్వాసనాళాలు, గొంతు సమస్యలు తగ్గుతాయి. గ్యాస్ సమస్యలను పుదీనా ఈజీగా తొలగిస్తుంది. పుదీనా టీ చేసుకుని తాగితే శరీరం ఉత్సాహంగా ఉంటుంది. పుదీనా జ్యూస్ తో మన శరీరం అలసట, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Naturopathic doctors say that mint leaves has many health benefits and it is a divine medicine if taken daily.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X