health tips: నరాల జబ్బులు.. ఆహారాలు.. ఇంటి చిట్కాలు!!

మానవ శరీరంలో నరాలు చాలా ముఖ్యమైనవి. నరాలు శరీరంలో రక్తాన్ని ఒకచోటి నుండి మరొక చోటికి సరఫరా చేస్తాయి. ఒక్కోసారి నరాలు బలహీనపడితే మనం అనేక అనారోగ్యాలను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రస్తుత సమాజంలో చాలామంది విపరీతమైన పని ఒత్తిడి కారణంగా నరాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.

సరైన పోషకాహారం తీసుకోకపోవడం, క్రమబద్ధమైన జీవన విధానం లేకపోవడం, కావలసిన విటమిన్లు సరిగా అందకపోవడం వంటి కారణాలు నరాల జబ్బులను వచ్చేలా చేస్తున్నాయి. అయితే నరాల బలహీనతతో పాటు, వివిధ నరాల సంబంధిత వ్యాధులకు గురవుతున్న వారు ఆహారం పైన ప్రత్యేకమైన దృష్టి సారించాలి. ఆసుపత్రికి వెళ్లి మందులను వాడే బదులు, ముందు నరాల సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందడానికి తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెట్టాలి.

health tips: Nerve Diseases.. foods and Home Tips!!

నరాల బలహీనతతో బాధపడేవారు రెగ్యులర్ గా వ్యాయామం, యోగ అలవాటు చేసుకుంటే నరాల వ్యవస్థ పటిష్టంగా మారుతుంది.ఇక నరాల బలహీనతను తగ్గించడంలో మందుల కంటే పండ్లు మంచి పాత్ర పోషిస్తాయి. దానిమ్మ పండు, నారింజపండు, కివీస్, స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలు పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వలన నరాల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.

అంతేకాదు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలను, అవిసె గింజలను, అక్రోట్ గింజలను వాడటం వలన కూడా ఫలితం ఉంటుంది. ముదురు రంగులో ఉండే ఆకుకూరలు కూరగాయలు కూడా నరాల వ్యాధులను తగ్గిస్తాయి. ఇక నరాల సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఒక ఇంటి చిట్కాను పాటిస్తే మంచిదని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.

ఈ చిట్కాలో భాగంగా ఒక గిన్నె.లో నీళ్లు తీసుకుని అందులో దాల్చిన చెక్క లేదా దాల్చిన చెక్క పొడి వేసుకొని అందులో ఒక నల్ల యాలుకను దంచి వేసుకోవాలి ఆ తర్వాత గ్లాసు నీళ్లను అర గ్లాసు నీళ్లు అయ్యేవరకు మరిగించి వడకట్టి ఇందులో ఆర్గానిక్ బెల్లం కలుపుకొని ప్రతిరోజు తాగాలి. ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల నరాల బలహీనత తగ్గుతుంది. సగానికి సగం నరాల జబ్బులు నయమవుతాయి.ప్రతీరోజూ రాత్రి పడుకునే ముందు ఈ కషాయం తాగితే మంచిది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+