health tips: సమ్మర్‌లో శరీరాన్ని చల్లగా ఉంచే ఈ 5పానీయాలు పర్ఫెక్ట్ సమ్మర్ డ్రింక్స్!!

సమ్మర్‌లో శరీరాన్ని చల్లగా ఉంచే మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, బత్తాయి, నారింజ రసం, నిమ్మకాయ రసం, పండ్ల రసాలు ఈ 5పానీయాలు పర్ఫెక్ట్ సమ్మర్ డ్రింక్స్ అని చెప్తున్నారు.

ఎండాకాలం రానే వచ్చింది. ప్రతి ఒక్కరూ వేసవి తాపం నుండి బయటపడటానికి ఏం తినాలి ఏం తాగాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక వేసవి కాలంలో ఎండల తాపం నుంచి బయటపడడం కోసం, శరీరాన్ని చల్లపరచడం కోసం, శరీరం డిహైడ్రేట్ కాకుండా కాపాడుకోవడం కోసం తీసుకోవలసిన పానీయాల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

 ఎండాకాలంలో ఐదు సమ్మర్ స్పెషల్ డ్రింక్స్

ఎండాకాలంలో ఐదు సమ్మర్ స్పెషల్ డ్రింక్స్


ఎండాకాలంలో మనం సరిగ్గా నీటిని తీసుకోకపోవడం వల్ల, శరీరం డిహైడ్రేట్ అయ్యి వేడి చేసి అనేక ఇబ్బందులు వస్తాయి. వడదెబ్బ, డిహైడ్రేషన్ ప్రమాదం ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ సీజన్లో కొన్ని ఆహార పదార్థాలు, పానీయాలు మన శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా, అనారోగ్యం బారి నుండి కాపాడతాయి. వేసవి తాపం నుండి మనల్ని రక్షిస్తాయి. శరీరం డిహైడ్రేట్ కాకుండా చూసి రక్షణ కల్పిస్తాయి. ఇక వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవలసినవి ఐదు ఉన్నాయి. ఈ ఐదింటిని తీసుకుంటే సమ్మర్ పర్ఫెక్ట్ డైట్ అని చెప్పవచ్చు.

మజ్జిగ

మజ్జిగ

ఎండాకాలంలో సాధ్యమైనంత వరకు పెరుగు, కాస్త ఉప్పు కలిపి మజ్జిగను తయారు చేసుకుని తాగుతూ ఉంటే శరీరం చల్లబడుతుంది. శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా మజ్జిగ బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు మన జీర్ణ వ్యవస్థను, పొట్టను, పేగులను కూడా మజ్జిగ ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎండాకాలంలో వేడి చేయకుండా మజ్జిగ సమ్మర్ సీజన్ ఫుడ్ గా మనకు పనికి వస్తుంది. ఇక మజ్జిగలో జీలకర్ర, ఉప్పు వేసి తయారు చేసుకోవచ్చు. పుదీనా కొత్తిమీర, అల్లంలతో కూడా రకరకాల ఫ్లేవర్లలో మజ్జిగను తయారు చేసుకొని తాగితే మేలు జరుగుతుంది.

 నిమ్మకాయల షర్బత్

నిమ్మకాయల షర్బత్

ఎండాకాలంలో నిమ్మకాయలను ఎక్కువగా ఉపయోగిస్తే మంచిదని చెబుతున్నారు. నిమ్మకాయలు కూడా వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయి. ఎండల తాపం నుండి శరీరాన్ని రక్షిస్తాయి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి చర్మానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరం డిహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది ఇది వేడి నుండి మనల్ని రక్షించడమే కాకుండా శరీరం తాజాగా ఉండేలా చేస్తుంది. ఎండాకాలంలో ఎక్కువగా మనం నిమ్మకాయ రసంలో ఉప్పు వేసి కానీ, కాస్త చక్కెర వేసి కానీ షర్బత్ లా చేసుకుని తాగవచ్చు. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది.

 పండ్ల రసాలు.. కానీ అన్నీ కాదు

పండ్ల రసాలు.. కానీ అన్నీ కాదు


ఇక ఎండాకాలంలో పండ్ల రసాలు కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. అయితే బయట మార్కెట్లో తయారు చేసే వాటిని తాగొద్దు, వాటికి బదులు ఇంట్లోనే పండ్ల రసాలను మీరే స్వయంగా తీసుకొని తాగితే మంచిదని సలహా ఇస్తున్నారు. బయట మార్కెట్లో అమ్మే పండ్ల రసాలలో ఐస్, చాక్రిన్, చక్కెర వంటి పదార్థాలను కలిపి తయారుచేస్తారు. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఎండాకాలంలో పండ్ల రసాలను తీసుకోవాలి అనుకుంటే ఏవి మంచిది? ఏవి కాదు? ఏవి శరీర వేడిని తగ్గిస్తాయి? అనేది తెలుసుకొని ఎటువంటి చెక్కర యాడ్ చేయకుండా ఇంట్లోనే పండ్ల రసాలను తయారు చేసుకుంటే మంచిదని చెబుతున్నారు.

 బత్తాయి లేదా నారింజ జ్యూస్

బత్తాయి లేదా నారింజ జ్యూస్

ఎండాకాలంలో నారింజ, లేదా బత్తాయి రసాన్ని తాగితే మంచిదని చెబుతున్నారు. నారింజ లేదా బత్తాయిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అంతేకాదు ఫైబర్, క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి. బత్తాయి లేదా నారింజలను వేసవికాలంలో తీసుకోవడం వల్ల వాటిలో ఉండే నీటి శాతం శరీరం డిహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. ఇవి ఎండాకాలంలో శరీరానికి, చర్మానికి మేలు చేస్తాయి.

కొబ్బరినీళ్లు

కొబ్బరినీళ్లు


ఇక ఎండాకాలంలో కొబ్బరినీళ్ళని ఎక్కువగా తాగడం వల్ల కూడా శరీరం డిహైడ్రేట్ కాకుండా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో ఉండే పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలోని వేడిని తగ్గించి, శరీరాన్ని చల్లబరిచి ఆరోగ్యం మెరుగుదలకు కొబ్బరినీళ్లు ఉపయోగపడతాయి. కాబట్టి ఎండాకాలంలో కొబ్బరినీళ్ళతోనూ ఎంతో మేలు జరుగుతుందని, ఈ ఐదింటిని సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ గా భావించి తీసుకుంటే మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఇక ఎండాకాలంలో పొరపాటున కూడా శీతల పానీయాలు తాగొద్దని సలహా ఇస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+