Health tips: షుగర్ పేషెంట్స్ ఉదయాన్నే ఈ ఆహారాలను అస్సలు తినొద్దు.. డేంజర్!!
డయాబెటిస్.. ఇప్పుడు మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి. షుగర్ వ్యాధి శోకటం అంటే చెట్టుకు చెదలు పట్టినట్టే అని పెద్దలు చెప్తారు. ఎప్పుడైతే షుగర్ వ్యాధి ఉన్నట్టు తెలుస్తుందో అప్పటి నుండి ఆహార అలవాట్లను, జీవన శైలిని తప్పనిసరిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏది పడితే అది తినటం, ఎప్పుడు పడితే అప్పుడు తినటం చెయ్యకూడదు. క్రమబద్ధమైన జీవన సరళితో షుగర్ ను ఎప్పటికప్పుడు కంట్రోల్ లో ఉంచుకోవాలి.
ఇక షుగర్ పేషెంట్స్ ఉదయాన్నే అల్పాహారంగా కొన్ని పదార్ధాలను అస్సలు తీసుకోకూడదు. చాలా మంది ఉదయాన్నే ఫ్రూట్ జ్యూస్ లు ఆరోగ్యం అని తాగుతూ ఉంటారు. కానీ షుగర్ పేషెంట్స్ ఫ్రూట్ జ్యూస్ ల విషయంలో జాగ్రత్త వహించాలి. ఫ్రూట్ జ్యూస్ లు తాగటం వలన షుగర్ పేషెంట్ లలో చెక్కెర స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. కాబట్టి ఫ్రూట్ జ్యూస్ లు తాగటం ఉదయం పూట అస్సలు మంచిది కాదు.

పండ్ల రసాల కంటే బత్తాయి, బొప్పాయి వంటి పండ్లను తినటం మంచిది. షుగర్ పేషెంట్స్ చాలా మంది ఉదయాన్నే పాన్ కేకులు తినకూడదు. అవి రుచిగా మనకు సంతృప్తిని కలిగించేవిగా ఉన్నప్పటికీ వాటి వలన రక్తంలో చెక్కెర స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి పాన్ కేకులకు షుగర్ పేషెంట్స్ దూరంగా ఉండాలి.
అంతేకాదు చాలా మంది ఉదయాన్నే స్మూతీలు చేసుకుని తాగుతూ ఉంటారు. డయాబెటిస్ పేషెంట్స్ కు స్మూతీలు మంచివి కాదు. ఇందులో పాలు, పెరుగు వివిధ రకాల పండ్లు, చెక్కెర ఉంటాయి. కాబట్టి స్మూతీలు తాగటం డయాబెటిస్ పేషెంట్స్ ను డేంజర్ లోకి నెడుతుంది. కాబట్టి డయాబెటిస్ బాధితులు స్మూతీలకు దూరంగా ఉండాలి .
డయాబెటిస్ బాధితులు క్యాండీలను అస్సలే తినకూడదు. ఉదయాన్నే వీటిని తినటం మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా పాడు చేసుకోవటం అవుతుంది. అల్పాహారంగా తీసుకునే క్యాండీ లలో ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. ఇవి చెక్కెరతో నిండి ఉంటాయి. కాబట్టి షుగర్ పేషెంట్స్ క్యాండీలకు దూరంగా ఉండాలి .
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications