health tips: విపరీతంగా ఒళ్ళునొప్పులా? పెయిన్ కిల్లర్స్ వాడకండి; నేచురల్ రెమిడీస్ ట్రై చెయ్యండి!!
చాలామంది విపరీతంగా ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఇక ఒళ్ళు నొప్పులను తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. ఉరుకుల పరుగుల జీవితంలో మన జీవన శైలి సరిగ్గా లేకపోవడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, సమయపాలన పాటించకపోవడం అంటే అనేక కారణాలు మనల్ని అనేక రకాల అనారోగ్య సమస్యలకు గురిచేస్తున్నాయి. అందులో ఒళ్ళు నొప్పులు ఒకటి. ఉదయం నుంచి పని చేసి సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి ఒళ్ళు నొప్పులు, కాళ్ల నొప్పులతో బాధపడే వాళ్లే ఎక్కువమంది ఉంటున్నారు. ఇక ఈ క్రమంలో ఒళ్ళు నొప్పులు, కాళ్ల నొప్పులకు పెయిన్ కిల్లర్స్ కాకుండా నేచురల్ రెమెడీస్ తో ఉపశమనం పొందడం ఎలాగో ఈరోజు మనం తెలుసుకుందాం.

ఒళ్ళు నొప్పులతో బాధపడే వారికి నేచురల్ చిట్కాలు ఇవే
ఒళ్ళు నొప్పులతో బాధపడే వాళ్ళు కొన్ని చిట్కాలు పాటిస్తే కాస్త నొప్పుల నుంచి రిలాక్సేషన్ ఉంటుందని నేచురపతి వైద్యులు చెబుతున్నారు. పసుపు, వేడి పాలు రాత్రి పడుకోబోయే ముందు ప్రతిరోజు తాగడం అలవాటు చేసుకుంటే ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం దొరుకుతుందని చెబుతున్నారు. పసుపు యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. దీంతో ఒళ్ళు నొప్పులకు చెక్ పెట్టినట్టు అవుతుంది. ఇక ఇదే సమయంలో ఒళ్ళు నొప్పులు నుండి ఉపశమనం పొందడానికి అల్లం వినియోగం కూడా మంచిదని చెబుతున్నారు.

ఒళ్ళు నొప్పులకు సహజ చిట్కాలే మేలు
ఒక అల్లం మొక్కను నీళ్లలో వేసి బాగా మరిగించి దానిని వడకట్టి ఆ నీళ్లలో తేనెను కలుపుకుని తాగితే చాలావరకు ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. ఇక అంతే కాదు ఒళ్ళు నొప్పులను తగ్గించుకోవడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఆపిల్ సైడర్ వెనిగర్ లోపల యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి, రుచికి అనుగుణంగా తేనె కలిపిన తర్వాత తాగితే మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. ఇది నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుందని సూచిస్తున్నారు.

నొప్పులు తగ్గటానికి చెయ్యాల్సిందే ఇదే
అంతేకాదు బెల్లం కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుందని, బెల్లం లో ఉండే ఐరన్ శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చి అలసటను తగ్గిస్తుందని చెబుతున్నారు. విపరీతంగా ఒళ్ళు నొప్పులు ఉన్నవాళ్లు బెల్లాన్ని తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడి కాస్త నొప్పులు తగ్గుతాయని అంటున్నారు. ఇక ఉప్పును వేడి చేసి ఓ వస్త్రంలో ఉంచి నొప్పి ఉన్నచోట కాపడం పెట్టినా నొప్పి నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

పెయిన్ కిల్లర్స్ వాడకుండా నొప్పుల ఉపశమనానికి ట్రై చెయ్యండి
ఇక వావిలాకును తెచ్చుకుని నీళ్ళలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే నొప్పులు తగ్గుతాయని అంటున్నారు. అంతేకాదు ఒక కప్పు ఆవనూనెలో నాలుగు లవంగాలు, వెల్లుల్లి వేసి మరిగించి, అది గోరువెచ్చగా ఉన్న సమయంలో దానిని నొప్పి ఉన్న ప్రదేశంలో రాసి మసాజ్ చేస్తే మెరుగైన ఫలితం ఉంటుందని చెప్తున్నారు. విపరీతంగా నొప్పులు ఉన్నాయని ప్రతిసారి పెయిన్ కిల్లర్స్ వేసుకోకుండా నాచురల్ రెమెడీస్ ఫాలో అయితే మంచిదని, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం వల్ల ఇతరత్రా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications