Winter Food: చలి కాలం ఈ పదార్థాలు తీసుకోండి.. వ్యాధులను దూరం చేసుకోండి..
రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. కొన్ని చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో పిల్లులు, వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా వాతావరణం చల్లగా ఉండడంతో జలుబు, దగ్గు, జ్వరం బారిన పడుతున్నారు. ఇలాంటి సమయాల్లో పౌష్టికాహారం తీసుకంటే అనారోగ్యం దరి చేరాదు. ముఖ్యంగా జలుబు చేస్తే రోగనిరోధక శక్తి తగ్గినట్లుగా.. ఇబ్బంది పడుతుంటారు. అందుకే పలు రకాల ఆహారాలు తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

పైనాపిల్ జ్యూస్
పైనాపిల్ లో మాంగనీస్, కాపర్, విటమిన్ బీ6, సీ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఐరన్, కాల్షియం, జింక్, విటమిన్ కేతోపాటు కోలిన్ లభిస్తాయి. ఇవి శరీరానికి శక్తిని అందించి రోగల బారిన పడకుండా చేస్తాయి. పైనాపిల్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ శక్తి పెరుగుతోంది. ఆస్తమాను కూడా అదుపులో ఉంచుతుంది.

నిమ్మరసం
రోగ నిరోధ శక్తి ఉండాలంటే నిమ్మరసం తప్పకుండా తీసుకోవాలి. నిమ్మరసంలో విటమిన్ సీ, కాల్షియం, మెగ్నిషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతోంది. నిత్యం ఉదయాన్నే గోరువెచ్చటి నీటిలో నాలుగు చుక్కల నిమ్మరసం కలుపుకుని తాగడం మంచిది.

యాపిల్ జ్యూస్
యాపిల్స్ చలి కాలం తక్కువ ధరకు దొరుగుతాయి. ఈ యాపిల్ జ్యూస్‌లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా, బలంగా ఉండేందుకు ఆపిల్ జ్యూస్ ఉపయోగపడుతుంది. రోజూ యాపిల్ జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

దానిమ్మ
దానిమ్మ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండి శరీరంలోని కణాలు డ్యామేజి కాకుండా, ఇన్ఫ్లమేషన్ రాకుండా చేస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతోంది. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు శ్వాసవ్యవస్థలో ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేస్తుంది.












Click it and Unblock the Notifications