బీజేపీకి అన్నామలై బిగ్ షాక్..? తమిళ రాజకీయాల్లో ఊహించని మలుపు..!!

తమిళ రాజకీయాల్లో సంచలనం. బీజేపీ ఫైర్ బ్రాండ్ అన్నామలై కమలం పార్టీకి షాక్ ఇచ్చేందుకు సిద్దమయినట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ ఎన్డీఏ కూటమిగా అన్నా డీఎంకేతో కలిసి పోటీ చేసింది. ఆ పార్టీ డిమాండ్ మేరకే అన్నామలైను రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. అన్నాడీఎంకేతో పోటీ.. 27 సీట్లకే పరిమితం అవ్వటం అన్నామలై కు నచ్చలేదు. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు విజయ్ ప్రభుత్వం వేళ అన్నామలై సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

తమిళనాడులో రాజకీయం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కొత్త పార్టీతో రాజకీయాలలోకి రాబోతున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఇందుకు అనుగుణంగా జూన్‌ 4వ తేదీన అన్నామలై పుట్టినరోజును ప్రత్యేకంగా నిర్వహించేందుకు ఆయన మద్దతు దారులు సిద్దమయ్యారు. తన జన్మదినం నాడు అన్నామలై కొత్త పార్టీ ఏర్పాటు పైన ప్రకటన చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఆయన మద్దతు దారులు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు.. బోర్డులు ఏర్పాటు చేసారు. రాష్ట్రంలో ప్రాంతీయ సమీకరణాలు బలంగా ఉండటం, అదే సమయంలో అటు రాష్ట్రంలోనూ, ఇటు కేంద్రంలోనూ తమిళనాడు ఆకాంక్షలకు సరైన రీతిలో ప్రాతినిధ్యం దక్కడం లేదనే అసంతృప్తితోనే అన్నామలై ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

 ఏపీ నుంచి BJP రాజ్యసభ అభ్యర్దిగా.. TDP 'నో' అనే ఛాన్స్ లేకుండా..!!
ఏపీ నుంచి BJP రాజ్యసభ అభ్యర్దిగా.. TDP 'నో' అనే ఛాన్స్ లేకుండా..!!
annamalai-set-to-chart-new-political-course-party-launch-buzz-intensifies-here-the-details

అన్నామలై పార్టీ వీడరంటున్న బీజేపీ నేతలు

ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి, అనతికాలంలోనే తన దూకుడు రాజకీయాలతో తమిళనాట బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా నిలబెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే, అన్నామలై కొత్త పార్టీ పెడతారంటూ వస్తున్న వార్తలను బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని, ఇందులో ఎలాంటి నిజం లేదని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీపీ సెల్వం స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉన్న అపారమైన అభిమానం, దేశ సేవ చేయాలనే బలమైన సంకల్పంతోనే అన్నామలై రాజకీయాల్లోకి వచ్చారని, ఆయన ఎప్పటికీ బీజేపీకి విధేయుడిగానే ఉంటారని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో ఇటువంటి పుకార్లు రావడం సర్వసాధారణమేనని, గతంలోనూ ఇలాంటి ప్రచారాలు ఎన్నో చూశామని సెల్వం కొట్టిపారేశారు. అయితే.. అన్నామలై అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ నాయకత్వ నిర్ణయాల పైన మాత్రం అసహనంగా ఉన్నారు. ఇక, ఇప్పుడు జరుగుతున్న ప్రచారం పై ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+