మీకెందుకు ఆయాసం- హాయిగా రిలాక్స్ అవ్వండి: ట్రంప్ పంచ్

పశ్చిమ ఆసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. సోమవారం అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్‌పై దాడి చేసింది. ఆత్మరక్షణలో భాగంగానే ఈ దాడులు జరిపినట్లు అమెరికా రక్షణ శాఖ పేర్కొంది. ఇరాన్‌కు చెందిన రాడార్, కమ్యూనికేషన్స్ వ్యవస్థలపై తాజా దాడులు జరిగాయి. ఇదివరకు ఆ దేశ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సముద్రంలో మైన్‌లు వేసే నౌకలపై అమెరికా సైన్యం నిప్పులవాన కురిపించింది. ఇప్పుడు తాజాగా మళ్లీ దాడులు చోటు చేసుకోవడం ఇరాన్-అమెరికా యుద్ధం తిరిగి ప్రారంభమైందని భావిస్తున్నారు.

ఈ పరిణామాల మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దఫా రాజకీయాలపై ఆయన మాట్లాడారు. డెమోక్రటిక్ పార్టీ నేతలపై సెటైర్లు సంధించారు. సొంత పార్టీనీ తప్పు పట్టారు. రిపబ్లికన్లు అనుసరిస్తోన్న విధానాలు సరికావని వ్యాఖ్యానించారు. వీరి వైఖరి తన విధుల నిర్వహణనను పదే పదే అడ్డుకుంటోన్నాయని విమర్శించారు ట్రంప్. ఇరాన్ తో చర్చల సామర్థ్యానికి ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు.

Donald Trump Satirically say to Democrats Just sit back and relax It Will All Work Out in the End

ఈ మేరకు ట్రూత్ సోషల్ ఓ పోస్ట్ పెట్టారు డొనాల్డ్ ట్రంప్. రిపబ్లికన్లను దేశభక్తి లేనివారిగా అభివర్ణించారు. కొందరు రిపబ్లికన్లల్లో దేశం పట్ల భక్తి కొరవడిందని, అందుకే తన రోజువారీ విధుల్లో ఆటంకం కలిగిస్తోన్నారని చెప్పారు. తన పేరుతో కొందరు చర్చల సామర్థ్యానికి భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. మునుపెన్నడూ లేని విధంగా, పదే పదే ప్రతికూలంగా మాట్లాడటం, తనను విమర్శిస్తుండటం వల్ల సమర్థవంతంగా వ్యవహరించలేకపోతున్నానని ఆయన స్పష్టం చేశారు.

అమెరికాకు ప్రయోజనకరంగా ఉండే ఓ ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా ఉందని, దేశీయంగా వస్తున్న రాజకీయ విమర్శలు.. తనతో పాటు ఈ చర్చలకూ క్లిష్టతరం చేస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. చర్చల దిశగా వేగంగా కదలాలా, నిదానంగా కదలాలా, యుద్ధానికి వెళ్లాలా, వద్దా అని రాజకీయ ప్రముఖులు మునుపెన్నడూ లేని విధంగా పదే పదే ప్రతికూలంగా, దూషణల స్థాయికి చేరుకుని 'చిర్పింగ్' చేస్తున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు.

"అలాంటప్పుడు, పనిని సమర్థవంతంగా నిర్వహించడం, చర్చలు జరపడం చాలా కష్టమని ఈ డెమోక్రాట్లు గానీ, కొందరు దేశభక్తి రహిత రిపబ్లికన్లు గానీ ఎందుకు అర్థం చేసుకోరు?, నిశ్చింతగా ఉండండి, చివరికి అంతా సజావుగా సాగుతుంది. మీరు పదేపదే ఆటంకం కలిగించకుండా ఉంటే ఎప్పుడూ సజావుగానే జరుగుతుంది.. " అని ఆయన ట్వీట్ చేశారు. ఇదిలావుండగా ఇరు దేశాల మధ్య చర్చల స్థితి ప్రస్తుతం అస్పష్టంగా ఉంది. ట్రంప్ ప్రతిపాదిత ఒప్పందంలో ఇరాన్ మార్పులను సూచించడంతో తాజా అనిశ్చితి తలెత్తింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+