ధనస్సు రాశి, మకర రాశివారికి బాగా కలిసిరావాలంటే ఏం చేయాలి?

హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనస్సు రాశికి అధిపతి బృహస్పతి. మకర రాశికి అధిపతి శని దేవుడు. ఈ రెండు రాశుల వారు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి, అనుకున్న పనులు కలిసిరావడానికి చేయాల్సిన ముఖ్యమైన పరిహారాలు, సూచనలు కొన్ని ఉన్నాయి. వాటిగురించి వివరంగా తెలుసుకుందాం. అలాగే ఎవరికైనా సరే జాతకంలో గ్రహాల అనుకూలతతో పాటు సత్ప్రవర్తన, కష్టపడే తత్వం, క్రమశిక్షణ ఉన్నప్పుడు అదృష్టం మరింత వేగంగా కలిసివస్తుంది.

ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి అదృష్టం, విజయం లభించాలంటే లగ్నాధిపతి అయిన గురు గ్రహ అనుగ్రహం చాలా అవసరం. ప్రతి గురువారం గుడికి వెళ్లడం లేదా ఇంట్లోనే దైవచింతనతో గడపడం మంచిది. ముఖ్యంగా గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం కలిసివస్తుంది. గురువారం రోజున శనగలు, అరటిపండ్లు లేదా పసుపు రంగు వస్తువులను పేదలకు లేదా గుడిలో బ్రాహ్మణులకు దానం చేయాలి. దత్తాత్రేయుడు, శివుడు లేదా సాయిబాబాను పూజించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. 'ఓం నమో భగవతే వాసుదేవాయ' లేదా గురు శ్లోకాలను పఠించడం మంచిది. ఇంట్లోని పెద్దలు, గురువులు, తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవడం వల్ల ధనస్సు రాశి వారికి పనులు త్వరగా పూర్తవుతాయి.

Horoscope What should individuals belonging to the Sagittarius and Capricorn signs do to ensure good fortune

మకర రాశి

మకర రాశి వారికి అధిపతి శని దేవుడు. ఈ రాశి వారు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. శని ప్రభావం అనుకూలంగా ఉండాలంటే.. ప్రతి శనివారం శని దేవుడికి లేదా ఆంజనేయ స్వామికి నువ్వుల నూనెతో పూజ చేయడం చాలా శ్రేయస్కరం. శని దోషాలు తొలగి, పనులు కలిసిరావడానికి ప్రతిరోజూ లేదా శనివారం 'హనుమాన్ చాలీసా' పఠించడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. శనివారం రోజున నలుపు లేదా ముదురు నీలం రంగు దుస్తులు ధరించడం మంచిది.శని దేవుడు న్యాయాధికారి. కాబట్టి సమాజంలో వెనుకబడిన వారికి, అంధులకు, శారీరక వికలాంగులకు, కార్మికులకు సహాయం చేయడం లేదా అన్నదానం చేయడం వల్ల మకర రాశి వారికి అఖండ విజయాలు లభిస్తాయి. నల్ల నువ్వులు లేదా మినుములు దానం చేయడం కూడా మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+