Cancer News: క్యాన్సర్‌పై అపోహల స్వైర విహారం.. ఆ పండు తింటే నిజంగా రొమ్ము క్యాన్సర్ తగ్గుతుందా?
Health News: ఆరోగ్యాన్ని కాపాడటంలో పండ్ల పాత్ర ఎంతో ఉంది. సీజనల్ పండ్లు తినడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అయితే పండ్ల గురించి వివిధ ప్రచారాలు, అపోహలు ప్రజల్లో ఉన్నాయి. వాటిలో నిజం ఎంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే వారి కంటే ఎవరో చెప్పిన అబద్ధాన్ని గుడ్డిగా నమ్మేవారే ఎక్కువగా ఉంటున్నారు. ఈ తీరు సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పైనాపిల్ గురించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారింది. ఎముకలను బలంగా మార్చడంతో సహా గర్భధారణ సమయంలో అవసరమైన ముఖ్యమైన పోషకాలను ఈ పండు అందిస్తుందనే అపోహ దావానలంలా వ్యాపించింది. ఇవే కాకుండా రొమ్ముతో పాటు ఇతర క్యాన్సర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా పైనాపిల్‌కు ఉందని పలువురు విశ్వసిస్తున్నారు.

ఇందులో ఎంతమాత్రం నిజం లేదని వైద్యులు పేర్కొన్నారు. పైనాపిల్ రొమ్ము సంబంధింత అనారోగ్య సమస్యలు మరియు క్యాన్సర్లను నయం చేస్తుందని లేదా తగ్గిస్తుందని ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లేవని చెబుతున్నారు. అయితే కొన్ని క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉన్నట్లు వివిధ జంతు అధ్యయనాలలో తేలింది. అంతేకానీ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందనే విషయంపై వైద్యపరమైన ఏకాభిప్రాయం లేదా ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు లేవని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారు.
బ్రోమెలైన్ అనేది క్యాన్సర్ కణితి మంటను మాడ్యులేట్ చేయడం ద్వారా ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ 4T1 కణాలపై యాంటిట్యూమర్ ప్రభావాన్ని చూపిస్తుందని ఓ అధ్యయనం సూచిస్తోది. తద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ 4T1 సెల్ లైన్ పెరుగుదల మరియు విస్తరణను నిరోధించి, దాని మనుగడను తగ్గిస్తుందని తెలుస్తోంది. పైనాపిల్‌లో బ్రోమెలైన్ ఉన్నప్పటికీ ఇది రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను అణిచివేస్తుందని కానీ కణాల మరణాన్ని ప్రేరేపిస్తుందని కానీ చెప్పే శాస్త్రీయ ఆధారాలు లేవు.
పైనాపిల్ పూర్తి పోషకాహారం మరియు కేలరీలు తక్కువగా ఉన్న పండుగా మాత్రమే పరిగణించబడుతోంది. కానీ రొమ్ము క్యాన్సర్ అవకాశాలను తగ్గించగలదని వైద్యులు స్పష్టమైన హామీ ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి రోజువారీ మెనూలో పైనాపిల్‌ను జోడించడం ద్వారా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలరని విశ్వసించడం అపోహే అవుతుంది. రొమ్ము క్యాన్సర్ నుంచి దూరంగా ఉండటానికి సమతుల్య ఆహారం, రోజూ వ్యాయామం, సరైన బరువును కలిగి ఉండటం, ధూమపానం మరియు మద్యం లేదా అక్రమ మాదకద్రవ్యాలను తీసుకోవడం మానేయాలి.
పెరుగుతున్న వయస్సు, ఊబకాయం, మద్యపానం, కుటుంబ చరిత్ర, రేడియేషన్, పునరుత్పత్తి, పొగాకు వాడకం రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. రుతుచక్రం సరిగా లేని స్త్రీలకు ఈ ప్రమాదం మరికొంత ఎక్కువగా పొంచి ఉంది. కానీ దీని వెనుక ఉన్న ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడం సాధ్యం కాదు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications