షుగరు బాధితులకు దివ్య ఔషధం.. గుమ్మడి - ఇలా తీసుకుంటే..!!

గుమ్మ‌డికాయ. చాలా మంది ఇష్టంగా తింటారు. ఆయుర్వేద ప్ర‌కారం గుమ్మ‌డికాయ మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. గుమ్మ‌డికాయ‌లో అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. ఇందులో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గుమ్మ‌డికాయ‌ల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయ‌ని.. షుగరు వ్యాధి గ్రస్తులకు మేలు చేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

గుమ్మడి కాయను అనేక రకాలుగా వంటలో వినియోగిస్తారు. ఇక, ఆరోగ్య పరంగానూ ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యలు చెబుతున్నారు. గుమ్మ‌డికాయ‌ల్లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. బీటా కెరోటిన్ మ‌న శ‌రీరంలో విట‌మిన్ ఎ గా మారుతుంది. విట‌మిన్ ఎ వ‌ల్ల కంటి చూపు మెరుగు ప‌డుతుంది. గుమ్మ‌డికాయ‌ల్లో లుటీన్‌, జియాజాంతిన్ అనే పోష‌కాలు అధికంగా ఉంటాయి. ఇవి క‌ళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో స‌హాయం చేస్తాయి. గుమ్మ‌డికాయ‌ల్లో విట‌మిన్ సి, ఎ అధికంగా ఉండ‌డం వ‌ల్ల మన శరీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా మారుతుంది. శ‌రీరంలో తెల్ల ర‌క్త క‌ణాలు, యాంటీ బాడీలు ఉత్ప‌త్తి అవుతాయి. ఇవి ఇన్‌ఫెక్ష‌న్ల‌ను త‌గ్గిస్తాయి. జీర్ణాశ‌యం, పేగుల గోడ‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుమ్మ‌డికాయ‌ల్లో ఫైబ‌ర్‌, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లుఅధికంగా ఉండడం వ‌ల్ల ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ కాయ‌ల్లో ఉండే ఫైబ‌ర్ మ‌న శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

is-pumpkin-good-for-diabetes-and-high-blood-pressure-here-the-experts-suggestions

కాగా, పొటాషియం వ‌ల్ల బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ల వ‌ల్ల ర‌క్త నాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో గుండె జ‌బ్బులు రాకుండా నివారించ‌వ‌చ్చు. గుమ్మ‌డికాయ‌ల్లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. గుమ్మ‌డికాయ‌ల్లో ఉండే ఫైబ‌ర్ వ‌ల్ల మ‌నం తిన్న ఆహారంలో ఉండే పిండి ప‌దార్థాలు ర‌క్తంలో నెమ్మ‌దిగా గ్లూకోజ్‌గా మారుతాయి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది. గుమ్మ‌డికాయ‌ల్లో అధికంగా ఉండే ఫైబ‌ర్ మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గిస్తుంది. జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక.. గుమ్మడి గింజలతోనూ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, ఎముకల ఆరోగ్యం, పురుషుల సంతానోత్పత్తి, రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే, పరిమితి మేరకు వీటిని తీసుకోవటం ద్వారా లాభం కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+