షుగరు, జీర్ణ సమస్యలకు 'ఇసాబ్‌గోల్‌'తో చెక్..!!

మధుమేహం. ఇప్పుడు వయసుతో సంబధం లేకుండా ఇబ్బంది పెడుతోంది. అదే విధంగా జీర్ణ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మందులతోపాటు సరైన ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులు మధుమేహ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో ఇసబ్‌గోల్‌ (Psyllium Husk) మధుమేహ రోగులకు ఉపయోగకరమైన సహజ ఆహార పదార్థంగా గుర్తింపు పొందుతోంది. ఇప్పుడు ఈ ఇసాబ్ గోల్ తో అరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎలా వినియోగించాలో సూచిస్తున్నారు.

ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక అద్భుత వరం "ఇసాబ్‌గోల్ పొట్టు". దీనినే సైలియం పొట్టు అని కూడా పిలుస్తారు. ఇసాబ్‌గోల్ మొక్క విత్తనాల నుంచి లభించే ఈ పొట్టు జీర్ణవ్యవస్థను శుభ్ర పరచడంలో రామబాణంగా పనిచేస్తుంది. ఇది మధుమేహ రోగులకు ఉపయోగకరమైన సహజ ఆహార పదార్థంగా గుర్తింపు పొందుతోంది. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిల నియంత్రణకు ఇది ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఈ ఇసబ్‌గోల్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తగ్గే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా వినియోగించుకునేలా చేయడంలో కూడా ఇది సహాయపడుతుంద‌ని చెబుతున్నారు. రక్తంలో చక్కెర నియంత్రణతోపాటు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, జీర్ణక్రియ మెరుగుపరచడంలో కూడా ఇసబ్‌గోల్ ఉపయోగపడుతుంది.

చర్లపల్లి నుంచి తిరుపతికి మరో రైలు, కొత్త రూట్ లో- స్టేషన్లు.. షెడ్యూల్..!!
చర్లపల్లి నుంచి తిరుపతికి మరో రైలు, కొత్త రూట్ లో- స్టేషన్లు.. షెడ్యూల్..!!
isabgol-is-a-powerful-natural-fiber-that-aids-in-various-digestive-and-health-issues-including-cons

ఆరోగ్య పరమైన ప్రయోజనాలు

జీర్ణ స‌మ‌స్య‌ల‌ను తగ్గించి జీర్ణ వ్య‌వ‌స్థ‌కు కూడా మేలు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇసబ్‌గోల్ తీసుకునే సరైన సమయం భోజనం ముందు అని సూచిస్తున్నారు. ముఖ్యంగా అధిక కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం తినే ముందు 10 నుంచి 20 నిమిషాల ముందు తీసుకుంటే భోజనం తర్వాత గ్లూకోజ్ పెరుగుదలను తగ్గించడంలో ఇది సహాయపడుతుందని చెబుతున్నారు. మింగడంలో ఇబ్బందులు ఉన్నవారు ఇసబ్‌గోల్ వాడకూడదని హెచ్చరిస్తున్నారు. మధుమేహ రోగులు దీన్ని ప్రారంభించిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరిశీలించుకోవడం అవసరం. అవసరమైతే వైద్యులు మందుల మోతాదును మార్చాల్సి రావచ్చని చెబుతున్నారు. ఇసబ్‌గోల్ మధుమేహ నియంత్రణకు సహాయపడే సహజ ఆహార పదార్థమే గానీ, ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సరైన ఆహారం, వ్యాయామం, మందులు, వైద్యుల సూచనలతోపాటు దీన్ని ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+