జల్ జీరా.. సమ్మర్ లో సూపర్ డ్రింక్

వేసవి వేడి నుండి ఉపశమనం పొందడానికి జల్ జీరా ఒక మంచి పానీయం. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. లస్సీ, మజ్జిగతో పాటు వేసవిలో అత్యంత ప్రజాదరణ పొందిన డ్రింక్ లల్లో ఒకటి జల్ జీరా. నిమ్మకాయ, కొత్తిమీర, జీలకర్ర, పుదీన, ఇతర ప్రత్యేక మసాలాలతో దీన్ని తయారు చేస్తారు. దీని రుచి అద్భుతంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

వేసవిలో జల్ జీరా తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య రాకుండా నివారించవచ్చు. వడదెబ్బ నుండి కూడా రక్షణ లభిస్తుంది. ఇందులో చాలా తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుంది. దీనిని రోజువారీగా తీసుకోవడం వల్ల ప్రయోజనాలు పొందవచ్చు. దీన్ని పరిమితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అతిగా తాగితే అల్సర్ వంటివి సంభవించే అవకాశం ఉంది.

Jal Jeera The Low-Calorie Summer Drink That Boosts Digestion and Hydration Powered by Vitamin C

రోగనిరోధక శక్తిని పెంచుతుంది..

శరీరం ఆరోగ్యంగా ఉండటానికి బలమైన రోగనిరోధక వ్యవస్థ చాలా అవసరం. రోజూ ఒక గ్లాసు జల్ జీరా తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో అధిక మొత్తంలో విటమిన్ సీ ఉండటం వల్ల ఇది వివిధ రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది..

వేసవిలో జీర్ణక్రియ సమస్యలు సర్వసాధారణం. జల్ జీరాలో ఉండే పదార్థాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి, కడుపును ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిని క్రమం తప్పకుండా పరిమితంగా తీసుకోవడం వల్ల గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

డీహైడ్రేషన్, వడదెబ్బ నుండి రక్షణ..

వేసవిలో అధిక చెమట కారణంగా తరచుగా డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి పరిమితంగా చక్కని పరిష్కారం. ఇది శరీరాన్ని చల్లగా ఉంచి, వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది..

బరువు తగ్గాలనే లక్ష్యం ఉన్నవారు తమ వేసవి డైట్‌లో జల్ జీరాను చేర్చుకోవాలి. ఇందులో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. కాబట్టి దీనిని తాగడం వల్ల బరువు పెరగరు. అంతేకాకుండా, ఇది కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది, తద్వారా బరువు తగ్గించే ప్రక్రియకు తోడ్పడుతుంది.

శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది..

జల్ జీరా తయారీలో జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, నల్ల ఉప్పు వంటివి ఉపయోగిస్తారు. ఈ పదార్థాలన్నీ శరీరంలోని విష వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడతాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది. ఇది అనేక తీవ్రమైన వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించగలదు. వేసవిలో జల్ జీరా తాగడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మధుమేహం లేదా ఇతర తీవ్రమైన అనారోగ్యాలు ఉన్నట్లయితే, దీనిని సేవించే ముందు డాక్టర్ల సలహా తీసుకోవడం తప్పనిసరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+