వర్షాకాలంలో ఈ వ్యాధి చాలా డేంజర్.. జాగ్రత్త!
వర్షాకాలం వస్తుందంటేనే ఎంతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. వానలు కురవడంవల్ల చల్లటి వాతావరణంతోపాటు ప్రమాదకరమైన వ్యాధులు కూడా వస్తాయి. ఈ సీజన్ లో అందుకే జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తీసుకునే ఆహారం, తాగే నీరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రధానంగా ఈ సీజన్ లో కామెర్ల వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి కళ్లు పసుపు రంగులోకి మారతాయి. అలాగే మన శరీరంలో ఉండే అనేక తెల్లటి భాగాలు పసుపు రంగులోకి మారడమేకాదు.. బరువు కూడా తగ్గుతారు.
కామెర్ల వల్ల రక్తంలోకి బిలిరుబిన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఇలాంటి వాతావరణంలో కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అలక్ష్యం వహిస్తే మరణం సంభవిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కామెర్లు సోకుండా ఉండేందుకు ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.

మసాలా, నూనె, జిడ్డు ఆహారాలు : ఎవరికైనా కామెర్లు సోకిందంటే వెంటనే అతను వేయించిన ఆహార పదార్థాలను, జిడ్డుగా ఉండేవాటిని, స్పైసీ ఫుడ్ తీసుకోవడం మానేయాలి. డైట్ నుంచి వెంటనే ఈ తరహా ఆహారాలను తొలగించాలి. లేదంటే కాలేయం దెబ్బతింటుంది. తేలికపాటి పదార్థాలు, తిన్న వెంటనే జీర్ణమయ్యేవి తీసుకోవాలి. టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. వీటిల్లో ఉండే కెఫిన్ కామెర్లు సోకినవారికి చాలా ప్రమాదకరం.
చక్కెరను తగ్గించాలి : కామెర్లు వెంటనే తగ్గాలి అంటే పంచదార వినియోగం మానేయాలి. రిఫైన్డ్ షుగర్‌లో ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల కాలేయం దెబ్బతినడంతోపాటు చెడు కొవ్వు పేరుకుపోతుంది. కామెర్లు సోకినవారు తీపి పదార్థాలను వెంటనే మానేయాలి.
అరటిపండ్లు : అరటిపండ్లు తీసుకోవడంవల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగదని చాలామంది భావిస్తారు. కానీ కామెర్లు సోకితే అరటిపండు తినే అలవాటుంటే వెంటనే మానేయడం ఉత్తమం. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండి జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదిస్తుంది. శరీరంలో బిలిరుబిన్ స్థాయి వేగంగా పెరుగుతుంది.












Click it and Unblock the Notifications